Hampi gangrape case: ఇజ్రాయిల్ మహిళపై గ్యాంగ్ రేప్.. ఇద్దరు నిందితుల అరెస్ట్..
- హంపి సామూహిక అత్యాచారం కేసులో ఇద్దరి నిందితుల అరెస్ట్..
- మరో నిందితుడి కోసం పోలీసుల గాలింపు..
- ఇజ్రాయిల్ మహిళతో సహా ఇద్దరిపై సామూహిక అత్యాచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hampi gangrape case: కర్ణాటక హంపి గ్యాంగ్‌రేప్ కేసు సంచలనంగా మారింది. హంపీకి సమీపంలో 27 ఏళ్ల ఇజ్రాయిల్ పర్యాటకురాలితో పాటు హోమ్ స్టే నిర్వాహకురాలిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు కర్ణాటక పోలీసులు శనివారం తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు 6 బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అరెస్టయిన ఇద్దరు నిందితులను గంగావతికి చెందిన సాయి మల్లు, చేతన్ సాయిగా గుర్తించారు.
‘‘మేము ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేశాము. సాయి మల్లు, చేతన్ సాయి ఇద్దరూ గంగావతికి చెందినవారు’’ అని కొప్పల్ ఎస్పీ డాక్టర్ రామ్ అరసిద్ధి తెలిపారు. ఇంకో వ్యక్తిని అరెస్ట్ చేయాల్సి ఉందని, అతడి పేరును కూడా నిందితులు వెల్లడించారని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు.
Also Read
- Study Abroad: విదేశీ చదువుల జోరుకు బ్రేక్.. రెండేళ్లలో 31% తగ్గిన భారతీయ విద్యార్థులు
- Bangladesh: బంగ్లాదేశ్‌లో తీవ్ర విద్యుత్ సంక్షోభం.. భారత్ సాయం కోసం ఎదురుచూపు..
- NPS Pension Scheme: వారికి కేంద్రం గుడ్‌న్యూస్.. రూ.99తోనే పెన్షన్ పథకం.. అర్హతలు, ప్రయోజనాలు ఇవే..
- Jharkhand JPSC Protest: రాంచీలో ఉద్రిక్తంగా మారిన విద్యార్థుల పోరు.. 600 మంది విద్యార్థులపై ఎఫ్ఐఆర్..
Read Also: CM Revanth Reddy: రూ.500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన..
మార్చి 6న హంపి సమీపంలో ఇజ్రాయిల్ పర్యాటకురాలు, 29 ఏళ్ల హోమ్ స్టే నిర్వాహకురాలిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఇద్దరు మహిళలతో పాటు మరో ముగ్గురు పర్యాటకులు సనపూర్ సరస్సు ఒడ్డున నక్షత్రాలను చూస్తుండగా ఈ సంఘటన జరిగింది. ముగ్గురు పురుష పర్యాటకులను అమెరికాకు చెందిన డేనియల్, మహారాష్ట్రకు చెందిన పంజక్, ఒడిశాకు చెందిన బిబాష్‌గా గుర్తించారు.
రాత్రి భోజనం తర్వాత హోమ్ స్టే నిర్వాహకురాలు, ఇజ్రాయిల్ పర్యాటకురాలితో పాటు ముగ్గురు పురుష పర్యాటకులు బయటకు వెళ్లారు. సనపూర్ సరస్సు సమీపంలో తుంగభద్ర కాలువ ఎడమ ఒడ్డున కూర్చుని ఉండగా, బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు వారివద్దకు వచ్చి పెట్రోల్ బంక్ గురించి ఆరా తీశారు, ఆ తర్వాత రూ.100 డిమాండ్ చేశారు. బాధితులు నిరాకరించడంతో పర్యాటకులపై దాడికి పాల్పడ్డారు. ముగ్గురు మగ పర్యాటకుల్ని కాలువలోకి తోశారు. ఆ తర్వాత మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఇద్దరు హోమ్ స్టే నిర్వాహకురాలని కొట్టగా, మూడో వ్యక్తి ముగ్గురు పురుష పర్యాటకులను కాలువలోకి నెట్టాడు. ముగ్గురిలో డేనియల్, పంకజ్ కాలువను నుంచి బయటకు రాగా, ఒడిశాకు చెందిన బిబాష్ చనిపోయారు.
#WATCH | Karnataka | SP Koppal, Dr Ram Arasiddi says, "On the 6th of this month, five persons, two of them ladies and three men, were assaulted by three miscreants. They assaulted three men and sexually abused two females. Based on the complaint given by the victim, we registered… https://t.co/mwE1jOAqHm pic.twitter.com/aTjW8PxoXz
— ANI (@ANI) March 8, 2025
తాజావార్తలు
-
Trump: ట్రంప్ ప్రభుత్వంలో కీలక మార్పు.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఔట్
-
Study Abroad: విదేశీ చదువుల జోరుకు బ్రేక్.. రెండేళ్లలో 31% తగ్గిన భారతీయ విద్యార్థులు
-
Vishal: నేను బ్యాక్బెంచర్నే.. మా బ్యాచ్‌లో ఒకరు మాజీ డిప్యూటీ సీఎం, మరొకరు మాజీ మంత్రి..
-
Big Offer: శాంసంగ్ నుంచి బంపర్ ఆఫర్.. ఆ ఫోన్‌పై ఏకంగా రూ.37 వేలు డిస్కౌంట్..
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో తీవ్ర విద్యుత్ సంక్షోభం.. భారత్ సాయం కోసం ఎదురుచూపు..
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!