Hampi gangrape case: కర్ణాటక హంపి గ్యాంగ్‌రేప్ కేసు సంచలనంగా మారింది. హంపీకి సమీపంలో 27 ఏళ్ల ఇజ్రాయిల్ పర్యాటకురాలితో పాటు హోమ్ స్టే నిర్వాహకురాలిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు కర్ణాటక పోలీసులు శనివారం తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు 6 బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అరెస్టయిన ఇద్దరు నిందితులను గంగావతికి చెందిన సాయి మల్లు, చేతన్ సాయిగా గుర్తించారు.