TVK Vijay: ముఖ్యమంత్రి పదవిపై యాంకర్‌తో విజయ్ కీలక వ్యాఖ్యలు.. వీడియో వైరల్
- ఈనెల 7న సీఎంగా ప్రమాణం చేయనున్న విజయ్
- సోషల్ మీడియాలో పాత వీడియో వైరల్
- అతి పెద్ద పార్టీగా అవతరించిన టీవీకే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌కు చెందిన టీవీకే పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. 234 స్థానాలకు గాను 108 స్థానాలు గెలుచుకుని శక్తివంతమైన పార్టీగా నిలిచింది. మ్యాజిక్ ఫిగర్‌కు కేవలం 10 సీట్ల దూరంలోనే ఉన్నారు. ఇక మే 7న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు విజయ్ సిద్ధపడుతున్నారు. ఇందుకోసం చెన్నైలోని నెహ్రూ స్టేడియం రెడీ అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఇలాంటి తరుణంలో ఏడేళ్ల క్రితం వేదికపై విజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘సర్కార్’ సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమంలో యాంకర్‌గా వ్యవహరించిన ఓ నటుడు.. సినిమాల్లో ముఖ్యమంత్రి పాత్ర పోషిస్తారా? అని విజయ్‌ను అడిగాడు. దానికి విజయ్ స్పందిస్తూ.. ‘‘తాను సీఎంగా నటించను.. కానీ ముఖ్యమంత్రిని అవుతాను.’’ అని బదులిచ్చారు. అంతే ఫంక్షన్‌కు హాజరైన తల్లిదండ్రులతో పాటు కళాకారులంతా చప్పట్లతో ఉత్సాహపరిచారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. విజయ్ అన్నట్టుగానే ఒరిజినల్‌గా తమిళనాడు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఈనెల 7న సీఎంగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. ఇక విజయ్ కథానాయకుడిగా నటించిన ‘సర్కార్’ సినిమా 2018లో విడుదలైంది.
Also Read
- NSUI Protest: సీజేపీ 'త్రివర్ణ యాత్ర'కు ముందు అర్ధరాత్రి ఢిల్లీలో హైవోల్టేజ్ డ్రామా..
- Abhijeet Dipke: నంబర్ ప్లేట్లు లేని కార్లు వెంబడిస్తున్నాయ్.. నన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు..
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
తాజా ఎన్నికల్లో టీవీకే 234 స్థానాల్లో 108 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. అయితే పూర్తి మెజారిటీకి 118 సీట్లు అవసరమవుతుండగా.. కేవలం 10 సీట్ల దూరంలో నిలిచింది. దీంతో ప్రభుత్వం ఏర్పాటు కోసం ఇతర పార్టీల మద్దతు అవసరం ఉంది. కాంగ్రెస్‌తో సహా చిన్న పార్టీల దగ్గర 14 సీట్లు ఉన్నాయి. వారి మద్దతుతో విజయ్ అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉంది.
Throwback to the day the script met reality… and reality chose him. The roar still echoes. 🔥 #TVKVijayHQ pic.twitter.com/iIXyyA6VZP
— 🦋𝑱𝒆𝒔𝒔𝒊𝒆 (@yoursjessie_) May 5, 2026
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే పతకాలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు వైభవ్ రియాక్షన్ వైరల్!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
-
IND vs WI 4th T20: ఎన్నో మ్యాచ్‌లను గెలిపించాడు.. అతడు జట్టులో ఉండుంటే టీమిండియా గెలిచేది!
-
NSUI Protest: సీజేపీ ‘త్రివర్ణ యాత్ర’కు ముందు అర్ధరాత్రి ఢిల్లీలో హైవోల్టేజ్ డ్రామా..
ట్రెండింగ్
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!