TVK Vijay: ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ ముందున్న 3 మార్గాలివే!
- తమిళనాడులో హంగ్
- ఏ పార్టీకి లభించని స్పష్టమైన మెజార్టీ
- 100కు పైగా స్థానాలు గెలుచుకున్న టీవీకే
- మెజార్టీ మార్కు 118 స్థానాలు ఉండాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌కు చెందిన టీవీకే పార్టీ అతిపెద్ద శక్తిగా అవతరించింది. ప్రస్తుత ట్రెండింగ్ ప్రకారం 108 స్థానాల్లో విజయం దిశగా దూసుకెళ్తోంది. అయితే 234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో మెజార్టీ మార్కు 118 ఉండాలి. ఈ మార్కుకు టీవీకే దూరంగా ఉంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై రకరకాలైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ ముందు మూడే మూడు మార్గాలున్నాయి.
ఫస్ట్ ప్లాన్-1: తమిళనాడులో కొన్ని చిన్న పార్టీలు సీట్లు గెలుచుకున్నాయి. కాంగ్రెస్, పీఎంకే, సీపీఐ, వీసీకే పార్టీలు ఉన్నాయి. ఈ చిన్న పార్టీలను టీవీకే సంప్రదించవచ్చని వార్తలొస్తున్నాయి. చిన్న పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. డీఎంకే, అన్నాడీఎంకే ధీటుగా నిలబడడానికి విజయ్‌కు సాయపడుతుంది. అయితే చిన్న పార్టీలతో కొన్ని చిక్కులు కూడా వచ్చే అవకాశం ఉంది.
Also Read
సెకండ్ ప్లాన్-2: ఇక విజయ్ ముందు ఉన్న రెండో ఆప్షన్ ఏఐఏడీఎంకే. ఈ పార్టీతో కలిస్తే అతి పెద్ద కూటమి అవుతుంది. ఈ రెండు కలిస్తే సునాయాసంగా ప్రభుత్వం ఏర్పడుతుంది. ముఖ్యంగా పళనిస్వామికి పరిపాలనా అనుభవం కూడా ఉంది. అయితే ఈ ఎంపిక చేసుకుంటే రాజకీయంగా చాలా సున్నితమైంది. విజయ్ తన ప్రసంగంలో పాత ద్రావిడ వ్యవస్థకు వ్యతిరేకంగా వచ్చినట్లు చెప్పారు. ఒక వేళ పొత్తు పెట్టుకుంటే ప్రతిష్టతను దెబ్బతీయొచ్చు. టీవీకే శ్రేణులకు ఇబ్బంది కలిగించవచ్చు.
థర్డ్ ప్లాన్-3: విజయ్ ముందు ఉన్న మూడో అవకాశం డీఎంకే. కాంగ్రెస్‌తో కూడిన ఒక ఒప్పందం కూడా చేసుకోవచ్చు. డీఎంకేతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఎలాంటి ఇబ్బందులు రాకపోవచ్చు. అయితే ఎన్నికల ప్రచారంలో విజయ్.. డీఎంకేను, స్టాలిన్‌ను నేరుగా లక్ష్యంగా చేసుకుని విమర్శించారు. వారితో చేతులు కలిపితే మద్దతుదారులు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది.
విజయ్ ముందు ఉన్న ఈ 3 ఆప్షన్లను ఎలా ఉపయోగించుకుంటారన్నది ఆసక్తిగా మారింది. పార్టీ నేతలు, వ్యూహకర్తలు ఎలాంటి సలహా ఇస్తారో చూడాలి. మొత్తానికి విజయ్ ముఖ్యమంత్రి కావడం అనేది ఖాయం.
తాజావార్తలు
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!