Site icon NTV Telugu

Vijay: ఎన్డీఏ కూటమిలోకి విజయ్!? కీరోల్ ఇచ్చే దిశగా చర్చలు

Vijay

Vijay

తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార-ప్రతిపక్షాలు అధికారం కోసం వ్యూహాలు-ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఇక నటుడు విజయ్ కొత్త పార్టీ స్థాపించారు. టీవీకే (తమిళగ వెట్రి కళంగం) పార్టీ కూడా ఈసారి ఎన్నికల కదనరంగంలోకి దిగుతోంది. టీవీకే అధినేత విజయ్‌పై ఇటీవల అనేక కథనాలు వెలువడుతున్నాయి. సొంతంగా కాకుండా.. మరో పార్టీతో జత కట్టి ఎన్నికల్లోకి దిగుతారని ప్రచారం సాగుతోంది. ఆ దిశగా చర్చలు కూడా సాగుతున్నట్లు ప్రస్తుతం వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇది కూడా చదవండి:High Court-KTR: హైకోర్టులో కేటీఆర్‌కు ఊరట!

టీవీకే.. ఎన్డీఏ కూటమిలో చేరబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఎన్నికల పొత్తులపై డిసెంబర్‌లో నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే త్వరలోనే విజయ్ రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేపట్టబోతున్నట్లు సమాచారం. ఆ యాత్ర ముగిసిన తర్వాత.. ఏ పార్టీతో ముందుకు వెళ్తారన్నది తెలిసేది అప్పుడేనని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఒకవేళ ఎన్డీఏ కూటమిలో విజయ్ చేరతే.. దానికి విజయ్‌నే నాయకత్వం వహిస్తారని ఆ పార్టీ కార్యదర్శి ఆదవ్ అర్జున్ పేర్కొన్నారు. ఇప్పటికే బీజేపీ-ఏఐడీఎంకే పొత్తు పెట్టుకున్నాయి. ఒకవేళ విజయ్ కూడా కూటమిలో చేరితే.. ఆయనకు కీరోల్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయనను ముందు పెట్టి.. అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. మరీ.. ఏపీ కూటమి ఫార్ములా.. తమిళనాడులో కూడా వర్క్ అవుట్ అవుతుందో.. లేదో మరిన్ని రోజులు ఆగాల్సిందే.

ఇది కూడా చదవండి: High Court-KTR: హైకోర్టులో కేటీఆర్‌కు ఊరట!

Exit mobile version