Donald Trump: ఖలిస్తాన్ ఉగ్రవాది, అమెరికన్ సిటిజన్ అయిన గురుపత్వంత్ సింగ్ నిజ్జర్ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణతో భారత మాజీ ఇంటెలిజెన్స్ అధికారిపై కేసు నమోదు చేసిన ఫెడరల్ ప్రాసిక్యూటర్ డామియన్ విలియమ్స్‌ని కొత్తగా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తొలగించారు. ఇతడి స్థానంలో న్యూయార్క్‌లోని సదరన్ డిస్ట్రిక్ట్‌కి డిస్ట్రిక్ట్ అటార్నీగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) మాజీ ఛైర్మన్ జే క్లేటన్‌ను నామినేట్ చేస్తున్నట్లు ట్రంప్ గురువారం ప్రకటించారు.
Read Also: Falcon-9 Rocket: ఎలాన్ మస్క్ రాకెట్ ద్వారా భారత ‘జీశాట్-20’ శాటిలైట్ ప్రయోగం..
‘‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’’ సత్యం కోసం బలమైన పోరాట యోధుడిగా జే క్లేటన్ ఉండబోతున్నట్లు ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్టులో పేర్కొన్నారు. సెనేట్ ధ్రువీకరించిన తర్వాత క్లేటన్ డామియన్ విలియమ్స్ స్థానంలో ఉంటారు. జనవరి 21న అధ్యక్షుడి మార్పు జరిగిన తర్వాత డామియన్ రాజీనామా లేదా తొలగించడం జరుగుతుంది.
గత నెలలో విలియమ్స్ ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ని చంపడానికి మాజీ రా ఏజెంట్ వికాష్ యాదవ్ ఒక హంతకుడిని నియమించుకున్నట్లు అభియోగాలు మోపాడు. ఈ కుట్రలో భారత పౌరుడు నిఖిల్ గుప్తా కూడా సహకరించినట్లు ఆరోపించారు. ఇతడిని చెక్ రిపబ్లిక్‌లో అరెస్ట్ చేసి, అమెరికాకు అప్పగించారు. గుప్తా ఈ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించారు. వికాష్ యాదవ్‌ని రా ‘‘సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్’’గా అభివర్ణించారు.