Donald Trump: ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూఎస్ నుంచి అమెరికాకు కీలకమైన భరోసా లభించింది. ప్రధాని నరేంద్రమోడీతో ద్వైపాక్షిక సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ట్రంప్, ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించారు. మోడీ నాయకత్వంలోని భారత్‌పై ఎవరైనా దాడి చేస్తే అమెరికా సహాయానికి వస్తుందని అన్నారు. ‘‘మోడీ నాయకుడిగా ఉన్నంత వరకు భారత్‌పై దాడి జరిగితే వారికి అండగా ఉంటాం’’ అని ట్రంప్ అన్నారు.
మోడీ-ట్రంప్ భేటీలో రెండు దేశాల వాణిజ్యం, రక్షణ సహకారం, ఆర్థిక భాగస్వామ్యం, ప్రాంతీయ భద్రత వంటి అంశాలపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం ట్రంప్ మాట్లాడుతూ, మోడీతో తన చర్చలు సానుకూలంగా సాగాయని అన్నారు. మోడీ చాల కఠినమైన నెగోషియేటర్ అని ట్రంప్ కొనియాడారు. తాను అధ్యక్షుడిగా ఉన్నంత కాలం వైట్ హౌజ్‌లో భారత దేశానికి ఒక మంచి స్నేహితుడు ఉన్నాడని ట్రంప్ అన్నారు. ప్రధాని మోడీ పట్ల తనకు చాలా గౌరవం ఉందని అన్నారు.

