NTV Telugu Site icon

Marco Rubio: భారత మద్దతుదారుడే అమెరికా విదేశాంగ కార్యదర్శి.. ట్రంప్ కీలక ఎంపిక..!

Marco Rubio

Marco Rubio

Marco Rubio: డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం తర్వాత తన అడ్మినిస్ట్రేషన్ కూర్పును సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారు. ముఖ్యంగా భారతీయ అనుకూల అమెరికన్లకు ట్రంప్ పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటికే జాతీయ భద్రతా సలహాదారుగా మైక్ వాల్ట్జ్‌ని నియమించుకున్నారు. యూఎస్ సెనెట్‌లో ఇండియా కాకస్ అధిపతిగా ఉన్నారు. ఇండియాకు గట్టి మద్దతుదారుగా వాల్ట్జ్‌కి పేరుంది. దేశ రక్షణ వ్యవస్థని మరింత పటిష్టం చేస్తానని గతంలో చాలా సార్లు వాల్ట్జ్ పేర్కొన్నారు. ట్రంప్‌కి ఈయన లాయలిస్ట్‌గా ఉన్నారు. 2023లో ప్రధాని మోడీ అమెరికా పర్యటన సందర్భంగా క్యాపిటల్ హిల్‌లో చారిత్రత్మక ప్రసంగాన్ని ఏర్పాటు చేయడంలో మైక్ వాల్ట్జ్ కీలక పాత్ర పోషించారు. మైక్‌కి సైనికపరంగా చాలా అనుభవం ఉంది. ఫ్లోరిడా గార్డ్స్‌లో పనిచేయడానికి ముందు ఆయన నాలుగు ఏల్లు సైన్యంలో పనిచేశాడు. 50 ఏళ్ల వాల్ట్జ్ ఫ్లోరిడా నుంచి మూడు సార్లు అమెరికన్ కాంగ్రెస్‌కి ప్రాతినిధ్యం వహించారు.

Read Also: Mallu Ravi: బీఆర్ఎస్ నేతల ఆదేశాలతో రైతుల ముసుగులో కలెక్టర్ పై దాడి చేశారు..

ఇదిలా ఉంటే, ట్రంప్ మరోసారి భారతీయ అనుకూలుడైన సెనేటర్ మార్కో రూబియోని అత్యున్నత పదవికి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అమెరికా విదేశాంగ సెక్రటరీ పదివికి రూబియోని ఎంచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. రూబియోకి ఒక వేళ సెక్రటరీ ఆఫ్ స్టేట్ పదవి కట్టబెడితే అమెరికా విదేశాంగ విధానంలో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. రూబియో భారత్‌లో బంధాన్ని బలపరుచుకోవాలని, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో కీలక భాగస్వామిగా ఉంచడానికి చాలా సందర్భాల్లో మాట్లాడారు. ప్రత్యేకించి యూఎస్-భారత్ సహకారంలో, రక్షణ, వాణిజ్య రంగాలలో మరింత పురోగతి ప్రోత్సహించే అవకాశం ఉంది.

రూబియో భారత్‌తో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని కోరడంతో పాటు చైనాను తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తి. చైనా కమ్యూనిస్ట్ పార్టీ (CCP) యొక్క మానవ హక్కుల ఉల్లంఘనలు, వాణిజ్య పద్ధతులు మరియు దక్షిణ చైనా సముద్రంలో దూకుడు చర్యలను విమర్శించారు. సాంకేతికత బదిలీలపై ఆంక్షలు మరియు పరిమితులతో సహా చైనాపై ఆర్థిక ఒత్తిడిని పెంచే విధానాలకు ఆయన మద్దతు ఇచ్చారు.
ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాతో చర్చలకు పిలుపునిచ్చారు. నాటోకి గట్టి మద్దతుదారుగా ఉన్నారు. మధ్యప్రాచ్యంలో ఇజ్రాయిల్ దేశాన్ని తమకు అత్యంత కీలకమైన మిత్రదేశంగా భావిస్తున్నాడు. హమాస్‌ని పూర్తిగా తుదముట్టించే విధంగా పలు వ్యాఖ్యలు చేశారు.

Show comments