Quad Summit: ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా వేదికగా జరుగుతున్న క్వాడ్ సమావేశంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా, జపాన్ నేతలు పాల్గొన్నారు. మనీలాలో జరుగుతున్న ఆసియాన్ 2026 సమ్మిట్‌లో భాగంగా క్వాడ్ నేతల సమావేశం జరిగింది.
మంగళవారం జరిగిన ఈ భేటీలో మరోసారి ట్రంప్, ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోడీని ‘‘టఫ్ మ్యాన్’’ అని ప్రశంసించారు. ప్రధాని మోడీ పక్కనే ఉండగా, ఆయన ‘‘కఠినమైన వ్యక్తి’’ అని మోడీని చూపిస్తూ ట్రంప్ వ్యాఖ్యానించారు.ఆ తర్వాత జపాన్ ప్రధాని సనాయే తకైచినీ చూపిస్తూ ఆమె బహుశా ఇంకా కఠినమైన వ్యక్తి కావచ్చు అని ట్రంప్ అన్నారు. మోడీ తనకు మంచి మిత్రడుదని, సమర్థవంతమైన నాయకుడని ట్రంప్ కొనియాడారు. శాంతి, స్థిరత్వం, ఇండో పసిఫిక్ ప్రాంత భద్రతపై సభ్యదేశాలు చర్చించనున్నాయి. ఈ సమయలో రేర్ ఎర్త్ మెటల్స్ ఉత్తత్తి విషయంలో క్వాడ్ దేశాల మధ్య సహకారం పెరగాలని ట్రంప్ అన్నారు.
అరుదైన ఖనిజాల (Rare Earths) ఉత్పత్తిని పెంచేందుకు అమెరికా, భారత్, జపాన్ చేస్తున్న ప్రయత్నాలను ట్రంప్ ప్రస్తావించారు. మరో 10 నెలల్లో అమెరికాకు అవరసమైనవన్నీ అందుబాటులో ఉంటాయని చెప్పారు.“మనకు అవసరమైన ప్రతిదీ 10 నెలల్లో అందుబాటులో ఉంటుంది. అరుదైన ఖనిజాల ఉత్పత్తిలో మేము భారీ స్థాయిలో ముందుకు సాగుతున్నాం. ఇతర దేశాలు కూడా అదే చేస్తున్నాయి. జపాన్ చేస్తోంది, భారత్ చేస్తోంది, మనమందరం ఈ పని చేస్తున్నాం” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

