USA: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరసగా భారతీయులకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నాడు. ఇప్పటికే, ట్రంప్ ఇమ్మిగ్రేషన్, వలస విధానాలను కఠినతరం చేశాడు. ఇప్పుడు ఆయన దృష్టి H-1B వీసాలపై పడింది. ఈ వీసాలు దుర్వినియోగం అవుతున్నాయని, అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని ట్రంప్ ప్రభుత్వంలోని వ్యక్తులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మరో బాంబును పేల్చింది. కొత్తగా తీసుకున్న నిబంధనలతో H-1B వీసాదారుల జీవిత భాగస్వాములు, F-1 విద్యార్థులు, అమెరికాలో ఆశ్రయం కోరే వారిని ప్రభావితం చేస్తుంది. ఈ మార్పులు H-1B వీసాదారులలో అత్యధిక వాటాను కలిగి ఉన్న భారతీయ వర్కర్లను ప్రభావితం చేస్తాయి.
గతంలో బైడెన్ ప్రభుత్వం H-1B హోల్డర్ల జీవిత భాగస్వాములు (H-4), F-1 విద్యార్థులు (Optional Practical Training – OPT)లకు ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్స్ (EADs) ఆటోమెటిక్‌గా పునరుద్ధరించబడేవి. అయితే, తాజా నిర్ణయాలతో ఇకపై వీరి వర్క్ పర్మిట్లను రీన్యూ చేయించుకోవడానికి పరిశీలన ప్రక్రియను తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుంది. అంటే, ఇకపై ఆటోమెటిక్ పునరుద్ధరణ ఉండబోదు. ఖచ్చితంగా వర్క్ పర్మిట్ల కోసం స్క్రీనింగ్, పరిశీలనకు గురి అవుతారు.
Read Also: Pregnant Job Scam: “నన్ను ప్రెగ్నెంట్ చేస్తే.. రూ. 25 లక్షలు ఇస్తా”.. మహిళ బంపర్ ఆఫర్.. కట్‌చేస్తే..
F-1 విద్యార్థులు (OPT), అంటే చదవు పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం ప్రారంభించే వారికీ, అప్లికేషన్ ఆలస్యమైతే ఉద్యోగం తాత్కాలికంగా ఆగిపోవచ్చు. 2024లో అమెరికాలో 4.22 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. మొత్తం విదేశీ విద్యార్థుల్లో 27శాతం. H-4 వీసా హోల్డర్లు , వీరిలో చాలా మంది H-1B హోల్డర్ల భార్యలు/భర్తలు ఉన్నారు. వీరికి వర్క్ పర్మిట్ లేకపోతే కుటుంబ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. అధికారిక గణాంకాల ప్రకారం, అమెరికాలో H-1B వీసాల 71% భారతీయులు ఉన్నారు.
“2025 అక్టోబర్ 30 లేదా తర్వాత EAD రీన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్న విదేశీయులకు ఇకపై ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ ఉండదు. ఇది ఎక్కువ వెట్టింగ్ ప్రక్రియకు లోనవుతారు. తద్వారా మోసం లేదా హానికర ఉద్దేశ్యాలు ఉన్నవారిని గుర్తించవచ్చు.” అని అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ (DHS) వివరణ ఇచ్చింది.