NTV Telugu Site icon

Amit Shah: అంబేద్కర్‌పై వ్యాఖ్యలు.. అమిత్‌షా‌పై తృణమూల్ ప్రివిలేజ్ నోటీసులు.. .

Amit Shah

Amit Shah

Amit Shah: రాజ్యసభలో అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై ప్రతిపక్ష పార్టీలు ఫైర్ అవుతున్నాయి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్ నోటీసులు పంపింది. రాజ్యాంగ నిర్మాత వారసత్వాన్ని, పార్లమెంట్ గౌరవాన్ని దెబ్బతీశారని పేర్కొంది. రాజ్యసభలో టీఎంసీ నేత డెరెక్ ఓబ్రెయిన్ రూల్ 187 కింది నోటీసులు అందించారు. ప్రతిపక్షాలను ఉద్దేశించి అమిత్ షా చేసిన ప్రసంగం నుంచి ఈ వివాదం మొదలైంది.

రాజ్యాంగం ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన చర్చలో అమిత్ షా మాట్లాడుతూ.. ‘‘బీఆర్ అంబేద్కర్ పేరుని చెప్పడం ప్రతిపక్షాలకు ఫ్యాషన్ అయింది. అంబేద్కర్ , అంబేద్కర్ , అంబేద్కర్ , అంబేద్కర్ , అంబేద్కర్ , అంబేద్కర్ అని చెప్పుకోవడం ఫ్యాషన్ గా మారిపోయిందని, ఇన్ని సార్లు దేవుడి పేరు తలుచుకుంటే స్వర్గంలో చోటు దక్కేది.’’ అని ఆయన అన్నారు. నెహ్రూ ప్రభుత్వంతో విభేదించి అంబేద్కర్ రాజీనామా చేసిన విషయాన్ని అమిత్ షా గుర్తు చేశారు.

Read Also: Matrimonial fraud: విగ్గురాజా మామూలోడు కాదు.. 50 మందిని మోసం చేసిన నిత్య పెళ్లి కొడుకు

ఈ వ్యాఖ్యలపై రాజకీయ దుమారాన్ని రేపాయి. అమిత్ షా దళితులను అవమానించారని కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాలు ఆరోపించాయి. అంబేద్కర్‌కి క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు. అయితే, అమిత్ షా ప్రసంగంలోని చిన్న క్లిప్‌ని మాత్రమే కాంగ్రెస్ వైరల్ చేసిందని బీజేపీ ఆరోపించింది. అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఆందోళన చేస్తోంది.

మరోవైపు తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ‘‘ముసుగు తొలిగిపోయింది’’ అంటూ ట్వీట్ చేశారు. ‘‘అమిత్ షా డా. బాబాసాహెబ్ అంబేద్కర్‌ని అవమానించాలని అనుకున్నారు. ఇది బీజేపీ కులతత్వ, దళిత వ్యతిరేక మనస్తత్వానికి నిదర్శనం. 240 సీట్లు గెలిచిన తర్వాత ఇలా వ్యవహరిస్తే, ఒక వేళ 400 సీట్లు గెలిస్తే ఎలా ఉండేదో ఆలోచించుకోంది. వారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పూర్తిగా తుడిచివేసేవారు’’ అని ఆమె ఎక్స్‌లో ఫైర్ అయ్యారు.

Show comments