Site icon NTV Telugu

Abhishek Banerjee: దౌత్య బృందంలోకి మేనల్లుడు! యూసఫ్ పఠాన్‌కు షాక్!

Abhishekbanerjee

Abhishekbanerjee

పాకిస్థాన్ తీరును అంతర్జాతీయ వేదికపై ఎండగట్టేందుకు కేంద్రం రాజకీయ పార్టీలతో బృందాలను ఏర్పాటు చేసింది. ఏడు బృందాలను ఆయా దేశాలకు పంపించేందుకు రాజకీయ పార్టీలను పేర్లు అడిగింది. కానీ పేర్లు ఇవ్వకముందే కేంద్రం.. కమిటీ సభ్యుల్ని ఎంపిక చేసింది. ఈ వ్యవహారం పొలిటికల్‌గా దుమారం రేపింది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ యూసఫ్ పఠాన్‌ను దౌత్య బృందంలోకి తీసుకుంది. ప్రతి బృందంలో ఒక ముస్లిం ఎంపీ ఉండేలా కేంద్రం డిసైడ్ చేసింది. అయితే ఈ వ్యవహారం తృణమూల్ కాంగ్రెస్‌కు రుచించలేదు. తమను సంప్రదించకుండా యూసప్ పఠాన్‌ను ఎలా తీసుకుంటారని ఆ పార్టీ ప్రశ్నించింది. దీంతో దౌత్య బృందం నుంచి యూసప్ పఠాన్ తప్పుకున్నారు. తాజాగా ఆయనకు ఝలక్ ఇచ్చి.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీని ఎంపిక చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాలలోని డైమండ్ హార్బర్ (లోక్‌సభ నియోజకవర్గం) పార్లమెంటు సభ్యుడిగా పనిచేస్తున్నారు. 24 ఫిబ్రవరి 2012న థాయ్ జాతీయురాలు రుజిరాను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.

ఇది కూడా చదవండి: Israel-Gaza: గాజాపై కొనసాగుతున్న మారణహోమం.. 60 మంది మృతి

మమతా బెనర్జీకి కిరణ్ రిజిజు ఫోన్ చేసి మరొక ప్రతినిధి పేరు ఇవ్వాలని సూచించారు. దీంతో ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పేరును సిఫార్సు చేశారు. ప్రతినిధిని ఎంపిక చేసే ముందు పార్టీని సంప్రదించి ఉండాల్సిందని మమత సూచించారు.

ఇది కూడా చదవండి: Breaking News : మాజీ సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్‌ నోటీసులు

జేడీయూకు చెందిన సంజయ్ కుమార్ ఝా నేతృత్వంలోని బృందంలో బీజేపీకి చెందిన అపరాజిత సారంగి, బ్రిజ్ లాల్, జాన్ బ్రిట్టాస్, ప్రసన్ బారువా, హేమాంగ్ జోషి కూడా ఉన్నారు. ఈ ప్రతినిధి బృందం మే 22న బయలుదేరి.. ఇండోనేషియా, మలేషియా, దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్ దేశాలను సందర్శించనున్నారు. ఈ బృందంలో అభిషేక్ బెనర్జీ ఉండనున్నారు.

Exit mobile version