NTV Telugu Site icon

Siddique Murder Case: ఫాస్ట్ ట్రాక్ కోర్టులో సిద్ధిక్ హత్య కేసు విచారణ: సీఎం షిండే..

Siddique Murder Case

Siddique Murder Case

Siddique Murder Case: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నేత బాబా సిద్ధిక్ హత్య కేసు మహారాష్ట్రలో సంచలనంగా మారింది. శనివారం రాత్రి ముంబైలోని బాంద్రాలో తన కుమారుడి ఆఫీస్ వద్ద బాబా సిద్ధిక్‌పై ముగ్గురు దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సిద్ధిక్ మరణించారు. ఈ దాడికి గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించింది. నిందితుల్లో ఇద్దరిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు అధికార బీజేపీ కూటమిని విమర్శిస్తున్నాయి.

ఇదిలా ఉంటే సిద్ధిక్ హత్య కేసు విచారణ చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఏర్పాటు చేస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అన్నారు. ఈ ఘటనపై ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ విచారణ జరుపుతారని ప్రకటించారు. శాంతిభద్రతలను కాపాలని ముంబై పోలీసులను ఆదేశించామని, గ్యాంగ్ వార్ పుంజుకోవద్దని ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు.

Read Also: Hamas: ఇరాన్ , హిజ్బుల్లా మద్దతు కోసం అక్టోబర్ 07 దాడి ఆలస్యం.. 9/11 తరహా దాడులకు ముందుగా ప్లాన్..

బాంద్రాలోని ఖేత్ వాడి జంక్షన్‌లో శనివారం రాత్రి వీధిలైట్లు స్విచ్ ఆఫ్ చేయడం, ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో చీకటిలోనే మాజీ మంత్రి సిద్ధిక్‌పై కాల్పులు జరిగాయి. మూడు బుల్లెట్లు బాబా సిద్ధిక్ ఛాతిలోకి దూసుకెల్లాయి. ఒక బుల్లెట్ అతనితో పాటు కారులో ఉన్న వ్యక్తి కాలికి తగిలింది. బాబా సిద్ధిక్ కారు బుల్లెట్ ఫ్రూవ్ అయినప్పటికీ బుల్లెట్స్ అద్దం గుండా ప్రవేశించాయి. దీంతో దాడి కోసం అత్యాధునిక పిస్టల్స్ వాడి ఉంటారని పోలీసు వర్గాలు తెలిపాయి.

పోలీసులు ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నారు. ఘటనా స్థలం నుంచి పోలీసులు 13 రౌండ్ల 9.9 ఎంఎం డిటాచబుల్ మ్యాగజైన్‌తో ఉన్న పిస్టల్‌ని స్వాధీనం చేసుకున్నారు. బాబా సిద్ధిక్ తన కుమారుడు జీషన్ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న సమయంలో దాడి జరిగింది. దసరా రోజున అమ్మవారి ఉరేగింపు ఈ ప్రాంతంగా వెళ్తు్ండగా, పెద్ద ఎత్తున సంగీతం, క్రాకర్స్, బాణాసంచా శబ్ధాన్ని ఆసరాగా చేసుకుని దుండగులు సిద్ధిక్‌పై కాల్పులు జరిపారు. రెండు వారాల క్రితమే సిద్ధిక్‌కి హత్యా బెదిరింపులు రావడంతో పోలీసులు ఆయనకు వై-కేటగరి సెక్యూరిటీ ఇచ్చారు.