Tragic Video: స్విమ్మింగ్ పూల్‌లో అప్పటి వరకు ఈతకొట్టిన బాలుడు, బయటకు రాగేనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించే లోపే మరణించాడు. ఈ విషాదకర ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ సంఘటన జూన్ 21న జరిగింది. 15 ఏళ్ల బాలుడు సివల్ఖాన్ నివాసి సమీర్‌గా గుర్తించారు.
Read Also: Strong Hair : బలమైన జుట్టు పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వాల్సిందే…
అప్పటి వరకు స్నేహితులతో స్విమ్మింగ్ చేసిన బాలుడు, స్విమ్మింగ్ నుంచి బయటకు రాగానే నేలపై పడిపోడాడు. అక్కడ ఉన్నవారు వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. అయితే, బాలుడి కుటుంబం మాత్రం ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదు.
స్థానిక మీడియా ప్రకటారం.. సమీర్ క్రికెట్ ఆడిన తర్వాత స్థానికంగా ఉన్న బ్లూ హెవెన్ స్మిమ్మింగ్పూల్‌కి మధ్యాహ్న సమయంలో వెళ్లాడు. చాలా సేపు ఈత కొట్టిన తర్వాత కొలను నుంచి బయటకు వచ్చి విశ్రాంతి తీసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని అడుగులు వేసిన వెంటనే అతను మూర్చపోయి నేలపై కూప్పకూలాడు. అక్కడే ఉన్నవారు అతడిని రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రాణాలు కోల్పోయాడు.
15-year-old boy collapses, dies moments after he comes out of a swimming pool in Uttar Pradesh's Meerut.
Incident happened on June 21 and was caught on CCTV.
Investigations are underway. #Meerut #CCTV #Video pic.twitter.com/jkKpAmDLWB
— Vani Mehrotra (@vani_mehrotra) June 22, 2024