NTV Telugu Site icon

Santokh Singh: భార‌త్ జోడో యాత్రలో విషాదం.. కాంగ్రెస్ ఎంపీ గుండెపోటుతో మృతి

Santokh Singh

Santokh Singh

Santokh Singh: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేప‌డుతున్న భార‌త్ జోడో యాత్రలో విషాదం చోటుచేసుకున్నది. ఇవాళ లుథియానాలో ఉద‌యం ర్యాలీ నిర్వహిస్తున్న స‌మ‌యంలో కాంగ్రెస్ ఎంపీ సంతోక్ సింగ్‌కు గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఎంపీ సంతోక్ కు 77 ఏళ్ల వయసు. ఫిల్లౌర్‌లో వాకింగ్ చేస్తున్న స‌మ‌యంలో ఎంపీ సంతోక్ నీర‌సంగా ప‌డిపోయారు. దీంతో ఆయ‌న్ను ప‌గ్వారాలోని హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. అయితే.. కాంగ్రెస్ నేత‌లు రాణా గుర్జీత్ సింగ్‌, విజ‌య్ ఇంద‌ర్ సింగ్లాలు ఎంపీ మృతిని ద్రువీక‌రించారు. కాగా.. ప్రస్తుతం రాహుల్ గాంధీ యాత్రను నిలిపివేశారు. అయితే.. గ‌తంలో సంతోక్ పంజాబ్ మంత్రిగా చేశారు. సంతోఖ్ సింగ్ చౌదరి ఒక భారతీయ రాజకీయ నాయకుడు, ఆయన జలంధర్ నుండి పార్లమెంటు సభ్యునిగా పనిచేశారు. పంజాబ్ మాజీ క్యాబినెట్ మంత్రి. అతను 2014- 2019 భారత సాధారణ ఎన్నికలు రెండింటిలోనూ భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి. చౌదరి అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు 2019 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ ఉనికిని చాటుకున్న కొద్దిమందిలో ఒకరు. కాబట్టి ఇది పాత పార్టీకి భారీ నష్టంగా పరిగణించబడుతుంది.

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా కాంగ్రెస్ నేత అకాల మరణం పట్ల సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు, సంతోక్ సింగ్ చౌదరి పంజాబ్‌లోని లూథియానా జిల్లాలో భారత్ జోడో యాత్రలో కుప్పకూలిపోయి ఆసుపత్రికి తరలించేలోగా మరణించారు. చౌదరి మృతికి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సంతాపం తెలుపుతూ,’జలంధర్‌కు చెందిన కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు సంతోక్ సింగ్ చౌదరి అకాల మరణం పట్ల నేను చాలా బాధపడ్డాను.. దేవుడు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను..’ అని ట్విట్టర్‌లో రాశారు.

Show comments