Site icon NTV Telugu

Maoist Surrender: మావోల ‘‘లొంగు’’బాట.. రేపు ఛత్తీస్‌గఢ్ సీఎం ముందు ఆశన్న సరెండర్..

Maoist

Maoist

Maoist Surrender: మావోయిస్టులకు వరసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవ రావు అలియాస్ ఆశన్న లొంగిపోనున్నారు. రేపు, ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ముందు ఆయన లొంగిపోతారు. ఆశన్నతో పాటు 70 మంది మావోయిస్టులు ఆయుధాలు అప్పగించనున్నారు. లొంగిపోయే మావోయిస్టుల్లో దండకారణ్యం ఎస్డీసీ సభ్యులు రాజ్‌మన్, రనితతో సహా పలువురు డివిజన్ కమిటీ, ప్లాటూన్ కమాండర్లు ఉన్నారు. వీరంతా ఇప్పటికే, జగ్‌దళ్ పూర్ చేరుకున్నారు. లొంగుబాటు కార్యక్రమం కోసం వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్ సీఎంఓకు సమాచారం ఇచ్చారు.

Read Also: Mahabharath: క్యాన్సర్ తో మహాభారత్ నటుడి మృతి.. కర్ణుడి పాత్రలో…

1990లో మావోయిస్టుల్లో చేరిన ఆశన్న బాంబు తయారీ, ఆయుధాల తయారీ, గెరిల్లా వార్‌ఫేర్‌లో ఆరితేరారు. ఐపీఎస్ ఉమేష్ చంద్ర హత్య కేసులో పాటు మాజీ హోం మంత్రి మాధవరెడ్డి హత్యలో కూడా ఇతని ప్రమేయం ఉంది. ఈ లొంగుబాటుతో మరికొంత మంది మావోలు మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ పోలీసులు ముందు లొంగిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ముందు మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌ రావుతో పాటు మరో 60 మంది మావోలు లొంగిపోయారు. ఆయన ఫడ్నవీస్‌కు తన ఏకే -47 రైఫిల్‌ను అప్పగించారు. మల్లోజుల పై 100కు పైగా కేసులు ఉన్నాయి. ఈయనపై రూ.6 కోట్ల రివార్డు ఉంది.

Exit mobile version