NTV Telugu Site icon

Pakistan: ఇండియా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది పాకిస్తాన్‌లో ఖతం

Pakistan

Pakistan

Pakistan: పాకిస్తాన్‌లో తలదాచుకుంటున్న ఇండియా మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాదులంతా ఒక్కొక్కరుగా హతమవుతున్నారు. తాజాగా పాకిస్తాన్ లోని ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో ఉంటున్న లష్కర్ టాప్ కమాండర్ రియాజ్ అహ్మద్ అలియాస్ అబూ ఖాసిం హత్యకు గురయ్యాడు. పాకిస్తాన్ లో జరుగుతున్న ఉగ్రవాదుల హత్యల్లో ఇది నాల్గొవది. తాజాగా హతమైన ఉగ్రవాది జనవరి 1న జరిగిన ధంగ్రీ ఉగ్రదాడిలో ప్రధాన నిందితుడు. ఈ ఏడాది జనవరి 1న హిందూమెజారిటీ గ్రామమైన ధంగ్రీలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న క్రమంలో విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఏడుగురు మరణించగా.. 13 మంది గాయపడ్డారు.

Read Also: Ration Card: రేషన్ కార్డు ఉన్న వారికి అలర్ట్.. ఈ కేవైసీ అప్డేట్ చేయకుంటే సరుకులు అందవు

శుక్రవారం రోజున పీఓకేలో తెల్లవారుజామున ప్రార్థనల సమయంలో రావల్ కోట్ ప్రాంతంలోని ఆల్-ఖుదుస్ మసీదులో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిగి అబూఖాసింని హత్య చేశారు. జమ్మూ ప్రాంతానికి చెందిన అబూఖాసిం 1999లో సరిహద్దులు దాటి పాకిస్తాన్ పరారయ్యాడు. పూంచ్, రాజౌరి జిల్లాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. ఇతను ఎక్కువగా పీఓకేలోని మురిడ్నేలోని లష్కరేతోయిబా బేస్ క్యాంపు నుంచి పనిచేస్తున్నాడు. ఇటీవలే రావల్ కోట్ కు మారినట్లు తెలుస్తోంది. లష్కర్ చీఫ్ కమాండర్ సజ్జాద్ జాత్ కు కీలక సన్నిహితుడిగా ఉన్నాడు. ఈ ఏడాది పాకిస్తాన్ లో హత్య చేయబడిని ఇండియా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో అబూ ఖాసీం నాలుగో వ్యక్తి.