NTV Telugu Site icon

Pannun Case: ఖలిస్తాన్ ఉగ్రవాది పన్నూ హత్య కుట్ర కేసు.. అమెరికాకు అనుకూలంగా చెక్ రిపబ్లిక్ కోర్టు తీర్పు..

Pannun Case

Pannun Case

Pannun Case: ఖలిస్తాన్ ఉగ్రవాది, సిఖ్ ఫర్ జస్టిస్(ఎస్‌జేఎఫ్) సంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ హత్యకు కుట్ర పన్నాడనే అభియోగంతో నిఖిల్ గుప్తా అనే వ్యక్తిని చెక్ రిపబ్లిక్‌లో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతను అక్కడి జైలులో ఉన్నారు. ఈ కేసులో అమెరికా అధికారుల అభ్యర్థన మేరకు చెక్ అధికారులు నిఖిల్ గుప్తాని అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి అమెరికా అతడిని అప్పగించాలని చెక్ కోర్టులను కోరుతూ వస్తోంది. అయితే తనను అప్పగించవద్దని కోరుతూ నిఖిల్ గుప్తా వేసిన పిటిషన్‌ని చెక్ రిపబ్లిక్ అత్యున్నత కోర్టు అయిన రాజ్యాంగ కోర్టు బుధవారం తిరస్కరించింది.

52 ఏళ్ల భారతీయుడు నిఖిల్ గుప్తా, అమెరికా గడ్డపై అమెరికా జాతీయుడైన గురుపత్వంత్ సింగ్ హత్యకు కుట్ర పన్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇతను పన్నూను హతమార్చేందుకు భారత ప్రభుత్వ ఉద్యోగితో కలిసి పనిచేశారని ఆరోపిస్తూ అమెరికన్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు. జూన్ 30, 2023న చెక్ రిపబ్లిక్ లోని ప్రేగ్‌లో నిఖిల్ గుప్తా అరెస్ట్ చేయబడ్డాడు. అతడిని అప్పగించాలని అమెరికా కోరుతోంది.

Read Also: Kalki – Bujji: 6 టన్నులు-6 కోట్లు.. 30 గంటలు.. ‘బుజ్జి’ గురించి షాకింగ్ ఫ్యాక్ట్స్!

అప్పగింతకు వ్యతిరేకంగా నిఖిల్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్‌ని చెక్ రాజ్యాంగ న్యాయస్థానం విచారించింది. ఈ కేసులో రాజ్యాంగబద్ధంగా హామీ ఇవ్వబడిన ప్రాథమిక హక్కులు, స్వేచ్చలను ఉల్లఘించబడుతున్నట్లు రాజ్యాంగ న్యాయస్థానం గుర్తించలేదని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. విచారణకు ముందు నిర్భంధం నుంచి విడుదల చేయాలని గుప్తా చేసిన అభ్యర్థనను స్థానిక కోర్టు తిరస్కరించడానికి రాజ్యాంగ కోర్టు సమర్థించింది. అంతకుముందు జనవరిలో చెక్ హైకోర్టు గుప్తాను అమెరికాకు అప్పగించవచ్చని తీర్పుచెప్పింది. గుప్తాను అప్పగించాలా వద్దా అనే దానిపై న్యాయ మంత్రి పావెల్ బ్లేజెక్ తుది నిర్ణయం తీసుకుంటారు.

రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (R&AW) అధికారి విక్రమ్ యాదవ్ ఈ ప్లాట్ వెనుక భారతీయ అధికారి అని వాషింగ్టన్ పోస్ట్ ఏప్రిల్ 2024లో నివేదించింది. అప్పటి రా చీఫ్ సమంత్ గోయెల్ ఈ ఆపరేషన్‌కి అనుమతి ఇచ్చారని పేపర్ పేర్కొంది. అయితే, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ నివేదికను తోసిపుచ్చింది. పన్నూన్ చంపే కుట్రలో భారతీయ ఏజెంట్ల ప్రమేయం లేదని అసమర్థ, నిరాధారమైన ఆరోపణలు చేస్తుందని పేర్కొంది.