S Jaishankar: గత 10 ఏళ్లలో భారతదేశంలో మార్పు చోటు చేసుకుందని, ప్రస్తుతం ప్రపంచం భారతదేశం గురించి మాట్లాడుతోందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శనివారం అన్నారు. తిరువనంతపురంలో జరిగిన ‘విక్షిత్ సంకల్ప్ భారత్ యాత్ర’లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దశాబ్ధ కాలంలో భారత దేశ విజన్ మారిందని చెప్పారు. ‘‘నేను విదేశాంగ మంత్రిగా, నేను ప్రపంచాన్ని చుట్టేస్తాను, నిజానికి ఈ రోజు ప్రపంచం మొత్తం మన గురించి మాట్లాడుతోంది, 10,20,30 ఏళ్ల క్రితం ఇదే భారతదేశం ఉంది. భారతదేశంలో ఏం మారింది..? దీనికి నేను భారతదేశ విజన్ మారింది అని చెబుతున్నాను’’ అని ఆయన అన్నారు.
Read Also: INDIA bloc: ఇండియా కూటమిలో లుకలుకలు.. కాంగ్రెస్‌పై జేడీయూ నేత ఆరోపణలు..
ప్రస్తుతం దేశంలోని ప్రజలకు ఆధార్, బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, సాంకేతికను ఉపయోగించడం వల్ల వివిధ రంగాల్లో దేశం అద్భుతమైన విజయాలను సాధించడంలో సహాయపడిందని అన్నారు. 10 ఏళ్లలో ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని భారతదేశం ప్రజల జీవితాలను మార్చడానికి అద్భుతాలు చేసిందని కొనియాడారు. ఆరోగ్యం, నీరు, విద్యుత్, ఇల్లు, విద్య వంటి భారతీయులు ఎదుర్కొనే అనేక సమస్యలు అభివృద్ధి చెందిన దేశాలతో సహా అనేక ఇతర దేశాలలో కూడా ఉన్నాయని అన్నారు.
గత 46 ఏళ్లుగా ప్రభుత్వంలో ఉన్నానని జైశంకర్ చెప్పారు. అయితే నాకు గత 10 ఏళ్లు, మంత్రిగా 5 ఏళ్లు చాలా సంతృప్తినిచ్చాయని, ఎందుకంటే తాను ప్రభుత్వ పనితీరులో మార్పు చూశానని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి వి మురళీధరన్ కూడా పాల్గొన్నారు. కేంద్ర పథకాల ప్రయోజనాలు నిర్దేశిత లబ్ధిదారులందరికీ సమయానుకూలంగా చేరాలనే లక్ష్యంతో విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్రని బీజేపీ దేశవ్యాప్తంగా చేపట్టబడుతోంది.