Rs.2000 Notes: నేడే లాస్ట్ ఛాన్స్.. రూ. 2000 నోట్లను మార్చుకోండి లేదంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rs.2000 Notes: నేటితో రూ.2000 నోట్ల మార్పిడి, డిపాజిట్లకు ఆర్బీఐ ఇచ్చిన గడువు ముగియనుంది. రేపటి నుంచి రూ. 2 వేల నోటు చెల్లదు. అయితే.. ఇప్పటికే చాలా మంది తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. మరికొందరు ఇతర లావాదేవీల ద్వారా నోట్లను మార్చుకున్నారు. అయితే.. కొందరు మాత్రం నిర్లక్ష్యంగా.. ఏమరపాటుతో ఉన్నారు. అలాంటి వారు ఈరోజు చివరి అవకాశం. ఈరోజు తమ వద్ద ఉన్న పెద్ద నోట్లను బ్యాంకులకు వెళ్లి మార్చుకోవాలని బ్యాంకర్లు కోరుతున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మే 19, 2023న దేశంలో అతిపెద్ద కరెన్సీని డీమోనిటైజేషన్ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం ప్రకారం.. రూ. 2,000 నోటును చెలామణి నుంచి తొలగించారు.
అయితే.. ఈ నోట్లను మార్కెట్ లో మార్చుకునేందుకు సెప్టెంబర్ 30 వరకు వెసులుబాటు కల్పించింది. ఆర్‌బీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, మార్చి 31, 2023 నాటికి రూ.3.62 లక్షల కోట్ల విలువైన నోట్లు చెలామణిలో ఉన్నాయి. సెప్టెంబరు 1, 2023న ఆర్‌బీఐ విడుదల చేసిన లెక్కల ప్రకారం రూ.24,000 కోట్ల విలువైన రూ.2000 నోట్లు ఇప్పటికీ సామాన్య ప్రజల వద్దనే ఉన్నాయని, ఇంకా బ్యాంకులకు తిరిగి రావాల్సి ఉందన్నారు. అందులో రూ.3.32 లక్షల కోట్లు అంటే 93 శాతం నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయి. మిగిలిన 7 శాతం రూ. 24,000 కోట్లు రూ. 2000 నోట్లు ఇంకా వాపస్ రావాల్సి ఉంది. రూ.2000 నోట్లను డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి గడువు ముగిసిన తర్వాత.. ఆర్‌బిఐ తన ప్రాంతీయ కార్యాలయాల్లో కొంత కాలం పాటు మరిన్ని నోట్లను మార్చుకోవడానికి అనుమతించాలని భావిస్తోంది, తద్వారా ప్రజలకు ఉపశమనం లభిస్తుంది. అయితే దీనిపై RBI తన స్టాండ్‌ను 30 సెప్టెంబర్ 2023న స్పష్టం చేయవచ్చు.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
గడువు పొడిగిస్తారా?
పెద్ద నోట్ల మార్పిడికి గడువు పొడిగిస్తారా? అనే ప్రశ్న అందరికి ప్రశ్నార్థకంగా మారింది. సాధారణంగా పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడం.. లేదా నామినీ పేరును డీమ్యాట్‌తో లింక్ చేయడం.. అలాంటి ఫైనాన్స్ సంబంధిత పనులకు గడువు తేదీ పొడిగించబడుతుంది. ఈ విషయంలోనూ గడువు పొడిగిస్తారన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఎందుకంటే వరుసగా బ్యాంకులకు సెలవుల కారణంగా ఆర్‌బీఐ మరో నెల పొడిగించే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!