Site icon NTV Telugu

Delhi: నేడు ఢిల్లీలో జీఎస్టీ సమావేశం.. హాజరుకానున్న తెలుగు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు

Gst Meeting

Gst Meeting

దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈరోజు, రేపు రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో సమావేశాలు ప్రారంభంకానున్నాయి. బుధవారం ఉదయం 11 గంటలకు కౌన్సిల్ సమావేశం ప్రారంభం అవుతుంది. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరుకానున్నారు. తెలంగాణ నుంచి భట్టి విక్రమార్క, ఏపీ నుంచి పయ్యావుల కేశవ్ పాల్గొననున్నారు. కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, సీబీఈసీ ఛైర్ పర్సన్ హాజరుకానున్నారు.

ఇది కూడా చదవండి: Trump: భారత్‌ టారిఫ్‌లపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. వైట్‌హౌస్‌లో మీడియా ప్రశ్నకు సమాధానమిదే!

మొత్తం 33 మంది సభ్యులతో కూడిన ఈ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ సమావేశాల్లో జీఎస్టీ స్లాబ్‌లలో భారీ మార్పులు చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న 12 శాతం, 28 శాతం జీఎస్టీ స్లాబ్‌లను రద్దు చేసి సంబంధిత ఉత్పత్తులను 5 శాతం, 18 శాతం స్లాబ్‌లోకి మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే టుబాకో, లగ్జరీ ఉత్పత్తులపై మాత్రం 40 శాతం జీఎస్టీ కొనసాగనుంది. ఈ సవరణలతో ఆటోమొబైల్ రంగం ప్రధాన లబ్ధిదారు కానుంది.

ఇది కూడా చదవండి: BCCI: టైటిల్‌ స్పాన్సర్‌ వేటలో బీసీసీఐ.. ఆ కంపెనీలకు నో ఛాన్స్!

ఇక చిన్న హైబ్రిడ్ కార్లు, మోటార్‌సైకిళ్లపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించనున్నట్లు సమాచారం. అలాగే ఎస్‌యూవీ వాహనాలపై ప్రస్తుతం అమల్లో ఉన్న 50 శాతం జీఎస్టీని 40 శాతానికి తగ్గవచ్చని తెలుస్తోంది. ఇక ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం జీఎస్టీ తగ్గింపు వాహనాల ధరలను 6-8 శాతం వరకు తగ్గే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నిర్ణయాల వల్ల ద్విచక్రాల వాహనాల విక్రయాలు సంవత్సరానికి 10 శాతం వృద్ధి సాధించవచ్చని.. ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 8 శాతం పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.

Exit mobile version