VC Comments: పొట్టి దుస్తులు వల్లే అమ్మాయిలకు లైంగిక వేధింపులు.. వీసీ వ్యాఖ్యలపై విద్యార్థుల ఆందోళన
- పొట్టి దుస్తులతో లైంగిక వేధింపులు ఆహ్వానిస్తున్నారు
- అధ్యాపకులకు కూడా అంతరాయం కలిగిస్తున్నాయి
- వైస్-ఛాన్సలర్, ప్రొఫెసర్ వి.నాగరాజ్ సంచలన వ్యాఖ్యలు
- వీసీ వ్యాఖ్యలకు నిరసనగా విద్యార్థుల ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమ్మాయిలు వేసుకునే పొట్టి దుస్తులు కారణంగానే లైంగిక వేధింపులు జరుగుతున్నాయని వైస్-ఛాన్సలర్, ప్రొఫెసర్ వి.నాగరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వీసీ వ్యాఖ్యలను నిరసిస్తూ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఎదుట విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వీసీ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘మా దుస్తులను కాదు.. మా ఆలోచనా విధానాన్ని మార్చండి.’’ వంటి నినాదాలు చేశారు.
అసలేం జరిగిందంటే..
తమిళనాడు జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (టీఎన్ఎన్ఎల్‌యూ) క్యాంపస్‌లో అధికారిక క్లాస్ రిప్రజెంటేటివ్స్ సమావేశంలో వైస్-ఛాన్సలర్ నాగరాజ్ మాట్లాడుతూ.. మహిళా విద్యార్థులు షార్ట్స్ ధరించి లైంగిక వేధింపులను ఆహ్వానిస్తున్నారని.. ఇది అధ్యాపకులకు కూడా అంతరాయం కలిగిస్తుందని వ్యాఖ్యానించారు. అమ్మాయిలు క్యాంపస్‌లోనూ.. బయట కూడా సరియైన దుస్తులు ధరించాలన్నారు. ఒకవేళ సరైన దుస్తులు ధరించకపోతే వేధింపులకు గురి కావాల్సి ఉంటుందని సూచించారు. తాను గతంలో చేసిన వ్యాఖ్యలకు కూడా కట్టుబడి ఉన్నానని.. చాలా గర్వంగా ఫీలవుతున్నట్లుగా పేర్కొన్నారు. గత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడం లేదని.. విచారం కూడా వ్యక్తం చేయడం లేదని తెలిపారు.
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
- Rajnath Singh: యుద్ధం కోరుకోం.. ఎవరైనా కాలు దువ్వితే ఊరుకోం.. రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
ఆందోళన..
అయితే వైస్-ఛాన్సలర్ నాగరాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. క్యాంపస్ విద్యార్థులంతా నల్ల దుస్తులు ధరించి అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఎదుట ఆందోళనకు దిగారు. నాగరాజ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వ్యాఖ్యలు ఉపసంహరించుకుని.. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రిజిస్ట్రార్ వివరణ..
అయితే గతంలో చేసిన వ్యాఖ్యలను మాత్రమే వైస్-ఛాన్సలర్ నాగరాజ్ గుర్తు చేశారని.. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ (డాక్టర్) ఎస్.ఎం. బాలకృష్ణన్ విద్యార్థి సంఘం బార్ అండ్ బెంచ్‌కు తెలిపారు. విద్యార్థులు వైస్-ఛానల్సర్ మాటలను సందర్భం నుంచి వేరు చేసి తప్పుగా అర్థం చేసుకుంటున్నారని వివరణ ఇచ్చారు.
2016లో..
2016లో అప్పటి నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (NLSIU)లో అధ్యాపకుడిగా పని చేస్తున్న సమయంలో నాగరాజ్ మాట్లాడుతూ.. తరగతి గదికి అమ్మాయిలు షార్ట్స్ ధరించి రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. లింగ వివక్ష వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!