TMC MP Apology: కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై చేసిన వ్యాఖ్యలకు టిఎంసి ఎంపీ కళ్యాణ్ బెనర్జీ లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పినట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు (డిసెంబర్ 12) తెలిపారు. అయితే, సభ ప్రారంభమైన వెంటనే.. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ చేసిన వ్యాఖ్యలను లేవనెత్తడానికి అధికార కూటమికి చెందిన కొందరు సభ్యులు లేచి నిలబడ్డారు. కానీ, స్పీకర్ ఓం బిర్లా జోక్యం చేసుకుని.. సభ్యులపై ఏదైనా వ్యాఖ్యలు చేసే ముందు ఆలోచించాలన్నారు.. వారి గౌరవాన్ని దెబ్బ తీసేలా మాట్లాడొద్దని సూచించారు. ఎవరి పైనా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయరాదని స్పీకర్ పేర్కొన్నారు.
Read Also: AEE Nikesh Kumar: రూ.500 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు.. ఏసీబీ కస్టడీకి ఏఈఈ నిఖేష్
అయితే, లోక్ సభలో విపత్తు నిర్వహణ చట్ట సవరణలపై చర్చ సందర్భంగా.. COVID-19 మహమ్మారి సమయంలో కేంద్ర ప్రభుత్వం సహకరించలేదని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఆరోపించాడు. దానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ కౌంటర్ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాలకు సహాయం చేసి సంక్షోభాన్ని సక్సెస్ ఫుల్ గా నిర్వహించారని అన్నారు. కానీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కోవిడ్ వ్యాక్సిన్‌లను రాష్ట్రం గుండా రవాణా చేయడంలో అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించిందని ఆరోపించారు.
Read Also: Zebra OTT: ఓటీటీలోకి సత్యదేవ్ ‘జీబ్రా’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఇక, కరోనా సమయంలో భారతదేశం “విశ్వ బంధు”గా నిలిచి.. ప్రపంచంలోని అన్ని దేశాలకు సహాయం చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. ఆయనకు మద్దతుగా నిలిచి జ్యోతిరాదిత్య సింధియాపై టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మాటల దాడికి దిగాడు. దీంతో సభలో గందరగోళం చెలరేగింది. ఆ తర్వాత స్పీకర్ ఓం బిర్లా సభ్యులకు సర్ది చెప్పడంతో కేంద్రమంత్రి సింధియాకు టీఎంసీ ఎంపీ క్షమాపణలు చెప్పారు.