NTV Telugu Site icon

Tipu Sultan Row: మరోసారి “టిప్పు సుల్తాన్” వివాదం.. మైసూర్ ఎయిర్‌పోర్టు పేరు మార్పు ప్రతిపాదన..

Tipu Sultan

Tipu Sultan

Tipu Sultan Row: కర్ణాటకలో మరోసారి టిప్పు సుల్తాన్ వివాదం తెరపైకి వచ్చింది. గతంలో టిప్పు పేరు రాజకీయంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఉద్రిక్తతకు కారణమైంది. మరోసారి మైసూరు విమానాశ్రయం పేరు మార్పు వివాదం నేపథ్యంలో టిప్పు వివాదం రాజుకుంది. మైసూర్ ఎయిర్ పోర్టు (మందకల్లి విమానాశ్రయం) పేరును టిప్పు సుల్తాన్ విమానాశ్రయంగా మార్చాలని అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రతిపాదించారు. దీనిపై కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

హుబ్బళ్లి-ధార్వాడ్(తూర్పు) ఎమ్మెల్యే ప్రసాద్ అబ్బయ్య ఈ ప్రతిపాదన తీసుకువచ్చారు. కాగా, ఈ ప్రతిపాదనను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. టిప్పు సుల్తాన్, బ్రిటీష్ వారిని ఎదురించిన వీరుడిగా కాంగ్రెస్ కొనియాడుతూ.. సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అతని పుటిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. మరోవైపు లక్షలాది మంది హిందువులను కిరాకతంగా చంపడం, మతం మార్చాడని బీజేపీ ఆరోపిస్తోంది.

Read Also: Ayesha Omar: “నా సొంత దేశంలోనే నాకు భద్రత లేదు”.. పాకిస్తాన్ నటి సంచలన వ్యాఖ్యలు..

ఈ ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టిప్పు వివాదం రాజకీయ అంశంగా మారింది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోరు సావర్కర్ వర్సెస్ టిప్పు సుల్తాన్‌గా మారింది. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ఈ వివాదం రెండు వర్గాల మధ్య ఘర్షణకు కారణమవుతోంది. 2018 ఎన్నికల ముందు బీజేపీ టిప్పు అంశాన్ని ప్రస్తావించింది. జనాభాలో 13 శాతం ఉన్న ముస్లింలను సంతృప్తి పరిచేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని మాజీ సీఎం, బీజేపీ నేత యడియూరప్ప ఆరోపించారు.