Site icon NTV Telugu

Harish Rawat: పీఓకేను వెనక్కి తీసుకునే సమయం వచ్చింది.. కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు

Harish Rawat

Harish Rawat

Time To Take PoK Back, says Congress Leader Harish Rawat: పాకిస్తాన్ ఆధీనంలో కాశ్మీర్ ప్రాంతంపై ఇటీవల కాలంలో విపరీతంగా చర్చ నడుస్తోంది. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు మన సైనికాధికారులు కూడా పీఓకే ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటామని కామెంట్స్ చేశారు. అయితే ఈ కాంగ్రెస్ సీనియర్ నేత హరీష్ రావత్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న జమ్మూ కాశ్మీర్ ను స్వాధీనం చేసుకోవడానికి ఇదే మంచి సమయం అని అన్నారు.

Read Also: Exit Polls: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు బీజేపీవే.. తిరుగులేని కమలం పార్టీ..

పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)పై పాకిస్తాన్ కొత్త ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ నేత హరీష్ రావాత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఇప్పుడు బలహీన స్థితిలో ఉందని.. ఇదే సమయంలో మనం పాకిస్తాన్ నుంచి పీఓకేని స్వాధీనం చేసుకోవాలని ఆయన అన్నారు. రావత్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ అక్రమ ఆక్రమణ నుంచి పీఓకేను విడిపించడం మా బాధ్యత. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మేము పార్లమెంట్ తీర్మానం చేశామని అన్నారు. ఇప్పుడు మోదీ ప్రభుత్వం తమ ఎజెండాలో దీనిని కూడా చేర్చాలని అన్నారు. ఈ సమయంలో సమయంలో పాకిస్తాన్ బలహీన స్థితిలో ఉంది. మేము పాకిస్తాన్ నుంచి పీఓకేను తీసుకోగల సమయం ఇది అని అన్నారు.

ఇటీవల ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మాట్లాడుతూ.. ప్రభుత్వం పాక్ ఆక్రమిత కాశ్మీర్ స్వాధీనం చేసుకోవాలని ఆదేశిస్తే భారత సైన్యం సిద్దంగా ఉందని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు ఆసిమ్ మునీర్ మాట్లాడుతూ.. దేశంపై దాడి జరిగితే పాకిస్తాన్ లోని ప్రతీ అంగుళాన్ని రక్షించేందుకు సిద్ధంగా ఉన్నామని.. శతృవుపై పోరాడేందుకు పాకిస్తాన్ సైన్యం సిద్ధంగా ఉందని అన్నారు. అంతకుముందు అక్టోబర్ 28న, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)ని వెనక్కి తీసుకోవాలనే నిర్ణయాన్ని వెల్లడించారు.

Exit mobile version