Delhi Alert: ఢిల్లీకి ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష సూచన చేసిన ఐఎండీ
- ఢిల్లీలో తీవ్రంగా దెబ్బతిన్న వాతారణ పరిస్థితులు
- విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం
- ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్ష సూచన చేసిన ఐఎండీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం ఢిల్లీకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అంతేకాకుండా హస్తినలో గాలి నాణ్యత మరింత క్షీణించినట్లుగా తెలిపింది. శుక్రవారం కంటే శనివారం మరింత తీవ్ర స్థాయికి క్షీణిస్తుందని పేర్కొంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 401 దగ్గర ఉన్నట్లు తెలిపింది. ఇది చాలా తీవ్రమైనది అభిప్రాయపడింది. శనివారమంతా ఆకాశం మేఘావృతమై ఉంటుందని.. గరిష్ట ఉష్ణోగ్రతలు కనీసం మూడు డిగ్రీల వరకు తగ్గుతుందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో శనివారమంతా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: UP: ఓ షాపింగ్ మాల్‌లో కోతి హల్‌చల్.. కస్టమర్లకు చుక్కలు చూపించిన మంకీ
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ఇదిలా ఉంటే ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చలి గాలుల కారణంగా రైలు సేవలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇక ఢిల్లీ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు సాధారణంగానే కొనసాగుతున్నాయని.. అయితే టెర్మినల్-3లో మాత్రం విమానాలు ఆలస్యం అవుతున్నట్లు ఎయిర్‌పోర్టు సంస్థ తెలిపింది. పొగ మంచు కారణంగా 100 విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు తెలిపింది. విమాన సమయాల కోసం ప్రయాణీకులు ఎయిర్‌లైన్ వైబ్‌సైట్లను చెక్ చేసుకోవాలని విమానాశ్రయం సూచించింది. ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానాలో దట్టమైన పొగ మంచు కమ్ముకుంది. తెల్లవారుజాము నుంచి ఈ పరిస్థితి ఎదురవ్వడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇది కూడా చదవండి: HMPV Case : మరో హెచ్‌ఎంపీవీ కేసు.. 10 నెలల చిన్నారిలో బయటపడ్డ వైరస్!
#WATCH | Visibility reduced to zero as a blanket of dense fog witnessed in parts of Delhi-NCR
(Visuals from Subroto Park) pic.twitter.com/D2oxrkvaSZ
— ANI (@ANI) January 11, 2025
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!