NTV Telugu Site icon

Delhi Alert: ఢిల్లీకి ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష సూచన చేసిన ఐఎండీ

Delhirain

Delhirain

దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం ఢిల్లీకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అంతేకాకుండా హస్తినలో గాలి నాణ్యత మరింత క్షీణించినట్లుగా తెలిపింది. శుక్రవారం కంటే శనివారం మరింత తీవ్ర స్థాయికి క్షీణిస్తుందని పేర్కొంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 401 దగ్గర ఉన్నట్లు తెలిపింది. ఇది చాలా తీవ్రమైనది అభిప్రాయపడింది. శనివారమంతా ఆకాశం మేఘావృతమై ఉంటుందని.. గరిష్ట ఉష్ణోగ్రతలు కనీసం మూడు డిగ్రీల వరకు తగ్గుతుందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో శనివారమంతా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: UP: ఓ షాపింగ్ మాల్‌లో కోతి హల్‌చల్.. కస్టమర్లకు చుక్కలు చూపించిన మంకీ

ఇదిలా ఉంటే ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చలి గాలుల కారణంగా రైలు సేవలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇక ఢిల్లీ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు సాధారణంగానే కొనసాగుతున్నాయని.. అయితే టెర్మినల్-3లో మాత్రం విమానాలు ఆలస్యం అవుతున్నట్లు ఎయిర్‌పోర్టు సంస్థ తెలిపింది. పొగ మంచు కారణంగా 100 విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు తెలిపింది. విమాన సమయాల కోసం ప్రయాణీకులు ఎయిర్‌లైన్ వైబ్‌సైట్లను చెక్ చేసుకోవాలని విమానాశ్రయం సూచించింది. ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానాలో దట్టమైన పొగ మంచు కమ్ముకుంది. తెల్లవారుజాము నుంచి ఈ పరిస్థితి ఎదురవ్వడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇది కూడా చదవండి: HMPV Case : మరో హెచ్‌ఎంపీవీ కేసు.. 10 నెలల చిన్నారిలో బయటపడ్డ వైరస్!