NTV Telugu Site icon

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు మహిళా మావోలు మృతి

Encounter

Encounter

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌ జరిగింది. నారాయణపూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దులోని మార్హ్‌లో భద్రతా బలగాలు-నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. కాగా.. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు ముగ్గురు మహిళా నక్సలైట్లు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు సహా నక్సల్స్‌ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Read Also: Abudhabi Prince: వచ్చే నెలలో అబుదాబి యువరాజు భారత్‌లో పర్యటన..!

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దులోని మార్హ్‌ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నాయి. మావోయిస్టుల కోసం డీఆర్‌జీ, ఎస్టీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఉదయం నుంచి ఎన్‌కౌంటర్‌ కొనసాగుతోందని ఐజీ బస్తర్‌ పి. సుందర్‌రాజ్‌ తెలిపారు. ఇంకా కాల్పులు జరుగుతున్నాయని.. సైనికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, సేఫ్ గా ఉన్నట్లు ఆయన చెప్పారు.

Read Also: Rahul Gandhi: త్వరలో భారత్ జోడో యాత్ర!.. రాహుల్ గాంధీ వీడియో వైరల్