NTV Telugu Site icon

Assam: 3 వారాల తర్వాత గ్యాంగ్‌రేప్ కేసులో నిందితుల అరెస్ట్

Assam

Assam

అస్సాం రాష్ట్రంలో 14 ఏళ్ల బాలికపై గ్యాంగ్‌రేప్ కేసు తీవ్ర సంచలనం సృష్టించింది. ట్యూషన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా పదో తరగతి విద్యార్థినిపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు వ్యక్తమయ్యాయి. రోడ్లపైకి వచ్చి నానా హంగామా సృష్టించారు. దీంతో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందించి.. నిందితులను కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు.

ఇది కూడా చదవండి: Game Changer: అంత హడావుడి చేసి.. ఇలా గాలి తీసేశారు ఏంటి గురూ!

నాగోన్ జిల్లాలో 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో మూడు వారాల తర్వాత అస్సాం పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఆగస్ట్ 24 న పోలీసు కస్టడీ నుంచి తప్పించుకుని చెరువులో దూకి చనిపోయాడు. ఆగస్టులో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ట్యూషన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ముగ్గురు వ్యక్తులు అడ్డుకుని అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రంగంలోకి దిగి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ పరిణామంలో ప్రధాన నిందితుడు చెరువులో పడి ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు నిందితులు తప్పించుకున్నారు. మొత్తానికి మూడు వారాల తర్వాత ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరిని అస్సాంలోని మోరిగావ్ జిల్లాకు చెందిన పోలీసులు అరెస్టు చేయగా… మరొకరిని నాగాలాండ్‌లోని దిమాపూర్‌లో అరెస్టు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు.

ఇది కూడా చదవండి: Roshan Kanakala: హేయ్ రోషన్… నువ్వేనా.. ఇలా తయారయ్యావ్ ఏంటి?

ఆగస్టు 22న ఢింగ్‌లో 14 ఏళ్ల బాలిక ట్యూషన్‌ ముగించుకుని ఇంటికి వస్తుండగా మోటార్‌సైకిల్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆమెను చుట్టుముట్టి అత్యాచారం చేశారు. ప్రధాన నిందితుడు తఫాజుల్ ఇస్లామ్‌ను మరుసటి రోజు అరెస్టు చేసే ప్రయత్నం చేయగా చెరువులో పడి చనిపోయాడు. ఇద్దరు సహచరులు పరారీలో ఉండడంతో 3 వారాల తర్వాత అరెస్ట్ చేశారు. అరెస్టు అనంతరం నిందితులిద్దరినీ విచారణ నిమిత్తం నాగోన్ సదర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఇది కూడా చదవండి: Uruku Patela Review: ఉరుకు పటేలా రివ్యూ.. థియేటర్లకు ఉరుకులు పెట్టించేలా ఉందా? లేదా?