NTV Telugu Site icon

Canada: కెనడాలో భారతీయ విద్యార్థుల పరిస్థితి ఇది.. “వెయిటర్” ఉద్యోగం కోసం బారులు..

Canada

Canada

Canada: పైచదువులకు అమెరికా లేదా కెనడా వెళ్లాలి. ఇప్పుడు దేశంలో ఇదే ట్రెండ్ నడుస్తోంది. అమ్మానాన్నలు తమ పిల్లలు విదేశాల్లో ఉంటున్నారని తమ బంధువులకు గొప్పగా చెబుతూ మురిసిపోతున్నారు. ఒకప్పుడు ఈ దేశాల్లో జాబులు బాగానే దొరికేవి. పార్ట్‌టైమ్ జాబులతో విద్యార్థులు తమ ఖర్చుల్ని వెల్లదీసే వారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అమెరికా లేదా కెనడా కావచ్చు ఉద్యోగాలు అంత ఈజీగా వచ్చే పరిస్థితి లేదు.

Read Also: Shivraj Singh Chouhan: రైతులకు గుడ్‌న్యూస్.. పలు రకాల విత్తనాలు ఉచితంగా అందిస్తామన్న కేంద్రమంత్రి

తాజాగా.. కెనడాలో ఓ రెస్టారెంట్‌లో వెయిటర్ ఉద్యోగం కోసం భారతీయ విద్యార్థులు దాని ముందు బారులు తీరిన వీడియోని చూస్తే, పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థమవుతుంది. కెనడాలో తందూరి ఫ్లేమ్ అనే రెస్టారెంట్ ముందు, జాబ్ ఇంటర్వ్యూ కోసం భారతీయ విద్యార్థులు క్యూలో నిలుచున్న వీడియో వైరల్ అవుతోంది. వేలాది మంది వెయిటర్, సర్వీస్ స్టాఫ్‌ ఉద్యోగాల కోసం వరసలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది కెనడాలో చదువుకోవాలని, పనిచేయాలనుకునే వారిని ఒకటికి రెండుసార్లు ఆలోచింపచేస్తోంది.

లైన్‌లో వేచి ఉన్న విద్యార్థుల్లో ఒకరైన అగంవీర్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘నేను మధ్యాహ్నం 12గంటలకు ఇక్కడికి వచ్చాను. లైన్ భారీగా ఉంది. ఇంటర్నెట్ ద్వారా అప్లికేషన్ పెట్టా. ఇంటర్వ్యూ చేస్తామని చెప్పారు. కానీ అలాంటిదేం జరగలేదు. ఇక్కడ ఉద్యోగం ఉంటుందని నేను నమ్మను’’ అని చెప్పాడు. మరొక విద్యార్థి మాట్లాడుతూ.. ‘‘ఎవరికీ సరిగ్గా ఉద్యోగాలు లభించడంలేదు. నా స్నేహితుల్లో చాలా మందికి ఉద్యోగాలు లేవు.’’ అని చెప్పాడు.