Site icon NTV Telugu

Asim Munir: ‘‘యుద్ధ పిపాసి, జిహదీ జనరల్’’.. పాక్ ఆర్మీ చీఫ్ గురించి కీలక విషయాలు..

Asim Munir

Asim Munir

Asim Munir: ఇండియా, పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అసలు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఎక్కడ..? అనే ప్రశ్న అందరితో మెదులుతోంది. మీడియాలో వస్తు్న్న వార్తల ప్రకారం, ఆసిమ్ మునీర్‌ని ఆర్మీ చీఫ్‌ పదవి నుంచి తొలగించి, అరెస్ట్ చేశారనే వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ మొత్తం ఉద్రిక్తతకు కారణం మాత్రం ఆసిమ్ మునీరే. ఆయన చేసిన విద్వేష ప్రసంగం తర్వాత పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది. హిందూ-ముస్లింలు వేరని హిందువుల పట్ల, భారత్ పట్ల ద్వేషాన్ని వెల్లగక్కాడు.

భారత్ నుంచి వలస:

అయితే, ఆసిమ్ మునీర్ యుద్ధ పిపాసి అని, కరగుగట్టిన మతోన్మాది. ఆసిమ్ మునీర్ తల్లిదండ్రులు 1947 విభజన తర్వాత పంజాబ్ జలంధర్ నుంచి పాకిస్తాన్ రావల్పిండికి వలస వెళ్లారు. మునీర్ అక్కడే జన్మించాడు. ఇతడి తండ్రి సయ్యద్ సర్వర్ మునీర్ షా ఒక మదర్సాలో టీచర్‌గా పనిచేశాడు. అక్కడే ఇతను విద్యనభ్యసించాడు.

పాక్ ఆర్మీలో పదవులు:

నిజానికి పాక్ ఆర్మీ చీఫ్‌లు పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ నుంచి వస్తుంటారు. కానీ మునీర్ మాత్రం ఆఫీసర్స్ ట్రైనింగ్ స్కూల్ నుంచి సైన్యంలో చేరాడు. 1986తో కెరీర్ ప్రారంభించాడు. 2014లో మేజర్ జనరల్ హోదాను పొందాడు. జనరల్ కమర్ జావెద్ బజ్వా తర్వాత పాక్ ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. పాకిస్తాన్ చరిత్రలో పాకిస్తాన్‌లోని రెండు ప్రధాన సైనిక నిఘా సంస్థలు, అంటే ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI), మిలిటరీ ఇంటెలిజెన్స్ (MI) లకు అధిపతిగా పనిచేసిన ఏకైక సైన్యాధిపతి ఆయనే.

జిహాదీ జనరల్‌గా పేరు:

ఆసిమ్ మునీర్ మనోన్మాది. సైన్యాన్ని మతంగా భావించే వాడు. ఆగస్టు 2023లో పెషావర్‌లో జరిగిన గిరిజన జిర్గాలో మునీర్ మాట్లాడుతూ, “ప్రపంచంలోని ఏ శక్తి కూడా పాకిస్తాన్‌ను నెట్టలేదు. మేము అల్లాహ్ మార్గంలో జిహాద్ (పవిత్ర యుద్ధం) చేస్తున్నాము,విజయం మనదే అవుతుంది.’’ అంటూ కామెంట్స్ చేశాడు. దీని తర్వాత ఇతడికి జిహాదీ జనరల్ అనే ముద్ర పడింది.

రాజకీయ నాయకులతో సంబంధాలు:

ఆసిమ్ మునీర్ పాక్ ఆర్మీ చీఫ్ కావడానికి మరో కారణం. ఇతడికి రాజకీయ నేతలతో ఉన్న పరిచయాలే. సైన్యంలో ఉన్నప్పటికీ, ఇతడు రాజకీయ నేతలతో మంచి సంబంధాలు కొనసాగించే వాడు. సైన్యం కన్నా రాజకీయ నేతలతోనే చురుకుగా ఉండే వాడు. చివరకు ఇమ్రాన్ ఖాన్‌ని గద్దె దించడంలో, అతడిని అరెస్ట్ చేయడంలో, ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) పార్టీని బ్యాన్ చేయడంలో మునీర్ ప్రధాన పాత్ర వహించాడు.

భారత్‌పై విద్వేషం:

ఆసిమ్ మునీర్ భారత విద్వేషి. 2019లో ఇతను ఐఎస్ఐ చీఫ్‌గా ఉన్న సమయంలోనే పుల్వామా దాడి జరిగింది. పుల్వామా కుట్రలో ఇతను ప్రధాన సూత్రధారి. ఇప్పుడు, పహల్గామ్ అటాక్ కూడా ఇతడి కనుసన్నల్లోనే జరిగింది. కాశ్మీర్ తన జీవనాడి, హిందూ-ముస్లింలు వేరు వేరు అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారం తర్వాతే పహల్గామ్‌లో మతం ఆధారంగా హిందువుల్ని ఉగ్రవాదులు కాల్చి చంపారు.

Exit mobile version