NTV Telugu Site icon

PM Modi: వారు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని అనుకుంటున్నారు.. కాంగ్రెస్ అభ్యర్థిపై పీఎం ఫైర్..

Pm Modi

Pm Modi

PM Modi: కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్రమోడీ విమర్శన ధాటిని పెంచుతున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ దక్షిణ గోవా అభ్యర్థి వ్యాఖ్యలను ప్రధాని ప్రస్తావిస్తూ.. వారు రాజ్యాంగాన్ని అవమానించారని, దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ‘‘పోర్చుగీస్ పాలన నుంచి విముక్తి పొందిన తర్వాత గోవాపై భారత రాజ్యాంగం బలవంతంగా ప్రయోగించబడిందని, 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ విషయాన్ని రాహుల్ గాంధీకి తాను చెప్పాను’’ అని కాంగ్రెస్ సౌత్ గోవా అభ్యర్థి విరియాటో ఫెర్నాండెస్ సోమవారం ఓ బహిరంగ సభలో ప్రసంగించారు.

Read Also: Yogi Adityanath: కాంగ్రెస్ గెలిస్తే ముస్లిం చట్టం తెస్తారు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

మంగళవారం ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ‘‘కాంగ్రెస్ గోవా అభ్యర్థి ఆ రాష్ట్రానికి భారత రాజ్యాంగ వర్తించదని చెబుతున్నారు. గోవాపై రాజ్యాంగం బలవంతంగా తీసుకువచ్చారని అతను స్పష్టంగా చెప్పాడు. ఈ విషయాన్ని గతంలో కాంగ్రెస్ ‘షహజాదా(యువరాజు)తో చెప్పారు’’ అన్నారు. రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ ఇటీవల ప్రధాని మోడీ యువరాజు అని, కాంగ్రెస్ పార్టీని వంశపారంపర్య పార్టీగా అభివర్ణిస్తున్నారు.

‘‘ఇది బాబాసాహెబ్ అంబేద్కర్‌ని, రాజ్యాంగాన్ని అవమానించడం కాదా..? ఇది రాజ్యంగంతో జోక్యం చేసుకోవడం కాదా..? ఇదంతా దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలో భాగమే. నేను గోవాలో రాజ్యాంగాన్ని నిరాకరిస్తున్నారు. భారతదేశం అంతటా బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తిరస్కరించడానికి ప్రయత్నించింది’’ అని ప్రధాని మోడీ అన్నారు. ప్రధాని మోడీ, బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. కాంగ్రెస్ ఆరోపణలపై స్పందించిన మోడీ.. బీజేపీ పక్కన పెట్టండి, బాబా సాహెబ్ అంబేద్కర్ వచ్చినా రాజ్యాంగాన్ని రద్దు చేయలేరని ఇటీవల అన్నారు.

Show comments