NTV Telugu Site icon

MK Stalin: ‘‘కట్టు బానిసలా లొంగిపోయారు’’..బీజేపీ-అన్నాడీఎంకే పొత్తుపై స్టాలిన్..

Stalin

Stalin

MK Stalin: తమిళనాడులో బీజేపీ-అన్నాడీఎంకే పొత్తను శుక్రవారం అమిత్ షా ప్రకటించారు. రెండు పార్టీలు కలిసి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ పొత్తుపై అధికార డీఎంకే పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. ఈ పొత్తుని ‘‘ఓటమి అవినీతి కూటమి’’గా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అభివర్ణించారు. అధికారం కోసమే ఈ రెండు పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టాయని ఆరోపించాడు.

‘‘అన్నాడీఎంకే-బీజేపీ కూటమి విఫలం కావడానికి ఉద్దేశించబడిన కూటమి. ఈ పొత్తుకు తమిళ ప్రజలు పదేపదే పరాజయాలను అప్పగించారు. ఇప్పుడు విఫలమైన కూటమిని అమిత్ షా పునర్నిర్మించారు’’ అని స్టాలిన్ అన్నారు. రెండు పార్టీలకు సైద్ధాంతిక స్పష్టత లేకపోవడాన్ని స్టాలిన్ ప్రశ్నించారు.

Read Also: Geetu Royal : భర్తతో గొడవలు.. ఆ టైమ్ లో చనిపోదాం అనుకున్నా : గీతూ రాయల్

‘‘నీట్, హిందీ రుద్దడం, త్రిభాషా విధానం, వక్ఫ్ చట్టాన్ని అన్నాడీఎంకే వ్యతిరేకిస్తోందని, నియోజకవర్గాల పునర్విభజనలో తమిళనాడు ప్రాధాన్యం తగ్గించొద్దని చెబుతోందని, ఇవన్నీ కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో భాగమా..? కేంద్ర మంత్రి వీటి గురించి ఏం మాట్లాడలేదు. అన్నాడీఎంకే నాయకత్వం మాట్లాడటానికి కూడా అమిత్ షా అనుమతించలేదు. కేవలం డీఎంకేని తిట్టడానికి మాత్రమే సమావేశాన్ని ఉపయోగించారు’’ అని స్టాలిన్ అన్నారు.

తమిళనాడులో శాంతిభద్రతలు క్షీణించాయని అమిత్ షా చెప్పడాన్ని స్టాలిన్ ఖండించారు. మణిపూర్ అంశాన్ని గుర్తు చేస్తూ బీజేపీని విమర్శించారు. అన్నాడీఎంకే నేతలు బీజేపీకి కట్టుబానిసలా లొంగిపోయారని ఆయన దుయ్యబట్టారు.