Site icon NTV Telugu

Lalu on Modi: కేసులతో మా కుటుంబాన్ని వేధిస్తున్నారు.. మోడీపై లాలూ ఫైర్‌

Lalu

Lalu

Lalu on Modi: కేంద్రంలోని న‌రేంద్రమోదీ ప్రభుత్వంపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాద‌వ్ ఫైరయ్యారు. ఒక కేసు తరువాత మరొక కేసుతో తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని ప్రధాని మోడీపై ఆర్‌జేడీ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ మండిపడ్డారు. కేసులతో తమను బెదిరించలేరని స్పష్టం చేశారు. ల్యాండ్ ఫ‌ర్ జాబ్స్ స్కామ్ కేసులో త‌న‌తోనాటు త‌న భార్య ర‌బ్రీ దేవి, బీహార్ డిప్యూటీ సీఎం తేజ‌స్వి యాద‌వ్ త‌దిత‌రుల‌పై సీబీఐ చార్జిషీట్ దాఖ‌లు చేసిన రెండు రోజుల త‌ర్వాత లాలూ ప్రసాద్ యాద‌వ్ బుధ‌వారం స్పందించారు. రైల్వేశాఖ మంత్రిగా అవినీతికి పాల్పడ్డార‌ని లాలూ ప్రసాద్ యాద‌వ్‌పై ఆరోప‌ణ‌లు ఉన్న విషయం తెలిసిందే.

Read also: Extramarital Affair: అత్తతో ఎఫైర్.. ఒరేయ్ ఫ్రెండ్‌గా, ఎంత పని చేశావ్‌రా?

ఆర్జేడీ 27వ వార్షికోత్సవ వేడుక‌ల ప్రారంభోత్సవంలో లాలూ ప్రసాద్‌ మాట్లాడుతూ ఒక కేసు త‌ర్వాత మ‌రొక కేసు త‌న‌పైనా, త‌న కుటుంబ స‌భ్యుల‌పై పెడుతున్నార‌న్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిప‌క్షాల్లో ఐక్యత తేవ‌డానికి బీహార్ సీఎం నితీశ్ కుమార్ చేస్తున్న ప్రయ‌త్నాల‌ను లాలూ ప్రసాద్ యాద‌వ్ ప్రశంసించారు. 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ ఓట‌మి ఖాయమన్నారు. ఇందుకు సంబంధించి ముందుగా జ‌రిగే ప‌రిణామాల‌ను క‌ర్ణాట‌క తెలియ‌చెప్పిందని లాలూ చెప్పారు. ద‌క్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ అధికారానికి దూర‌మైంద‌ని.. ఇప్పటికీ బీజేపీ బేర‌సారాల‌కు పాల్పడుతుంద‌ని ప‌రోక్షంగా మ‌హారాష్ట్ర ప‌రిణామాల‌పై లాలూ వ్యాఖ్యానించారు.

Read also: Lust Stories 3 : త్వరలోనే బిగ్ అనౌన్స్ మెంట్ చేయబోతున్న మేకర్స్..?

`విప‌క్షాల మ‌ధ్య ఐక్యత‌కు బీహార్‌లో మ‌హాఘ‌ట్‌బంధ‌న్ మంచి ఉదాహ‌ర‌ణ‌ అన్నారు. అంబేద్కర్ వార‌స‌త్వంగా వ‌చ్చిన రిజ‌ర్వేష‌న్లను తొల‌గించ‌డానికి ప్రయ‌త్నిస్తున్న మ‌త‌త‌త్వానికి వ్యతిరేకంగా అందరం ధృడంగా పోరాడాల్సిన అవ‌స‌రం ఉందని లాలూ పేర్కొన్నారు. 2004-09 మ‌ధ్య కాలంలో రైల్వేశాఖ మంత్రిగా లాలూ ప‌ని చేసిన‌ప్పుడు మ‌ధ్యప్రదేశ్‌లోని జ‌బ‌ల్‌పూర్ ప్రాంతంలో గ్రూప్‌-డీ ఉద్యోగ నియామ‌కాల్లో అవినీతికి పాల్పడ్డార‌ని సీబీఐ అభియోగం మోపింది. ఉద్యోగాలు పొందిన వారి నుంచి లాలూ కుటుంబం.. వారి స‌న్నిహితులు భూమి గిఫ్ట్‌గా పొందార‌ని ఆరోప‌ణ‌లు ఉన్న విషయం తెలిసిందే.

Exit mobile version