Delhi Elections: 2015, 2020లో బీజేపీ గ్రాఫ్ ఇది.. 2025 బిగ్ ఛేంజ్ అవుతుందా?
- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 2015, 2020లో బీజేపీ గ్రాఫ్ ఇది
- 2025 బిగ్ ఛేంజ్ అవుతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. మరికొన్ని గంటల్లో ఫలితాలు వెలువడనున్నాయి. దేశ వ్యాప్తంగా ఢిల్లీ ఫలితాలపై ఆసక్తి నెలకొంది. ఈసారి ఏ పార్టీ గెలుస్తుందోనన్న ఉత్కంఠ రేపుతోంది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. ఆప్ మాత్రం అవి ఫేక్ సర్వేలంటూ తోసిపుచ్చుతోంది. ఇలా ఎవరికి వారే తమ వాదనలు వినిపిస్తున్నారు. ఈ ఊహాగానాలన్నింటికీ మరికొన్ని గంటల్లో తెరపడనుంది.
ఇది కూడా చదవండి: Sharad Pawar : 20ఏళ్ల తర్వాత బీహార్ లోకి ఎంట్రీ ఇస్తున్న శరద్ పవార్
Also Read
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
ఇదిలా ఉంటే 2015, 2020 ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గానీ.. బీజేపీ గానీ ఏ మాత్రం ప్రభావం చూపించలేదు. కాంగ్రెస్ అయితే జీరో సీట్లు సాధించింది. బీజేపీ అయితే కనీసం కొన్ని సీట్లైనా గెలిచింది. 2015లో వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 70 సీట్లలో 62 గెలుచుకుని ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పుడు బీజేపీ 8 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ కనీసం ఖాతా తెరవలేదు. ఇక 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 67 సీట్లు గెలుచుకుని తిరిగి ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్ ఏర్పాటు చేసింది. బీజేపీ కేవలం 3 సీట్లతో సరిపెట్టింది. అప్పుడు కూడా కాంగ్రెస్ ఒక్క సీటు గెలవలేదు.
అయితే ఈసారి జరిగిన ఎన్నికలు అందుకు భిన్నమని బీజేపీ వాదిస్తోంది. కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కమలం పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. దీనికి ఎగ్జిట్ పోల్స్ సర్వేలు కూడా కమలానికే జై కొట్టాయి. కనీసం 55 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పాయి. రెండో స్థానంలో ఆప్ ఉండబోతుందని పేర్కొన్నాయి. దీనికి ప్రధాన కారణం.. ఢిల్లీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పాయి. అంతేకాకుండా ఆప్ ప్రకటించినట్లుగానే.. బీజేపీ కూడా ఉచిత హామీలు ప్రకటించింది. దీంతో ఓటర్లంతా కమలం వైపు చూసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగా శనివారం బీజేపీ గెలుస్తుందా? లేదంటే ఆప్ గెలుస్తుందా? అన్నది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
ఇది కూడా చదవండి: AP Budget Session: కొత్త ఎమ్మెల్యేలకు శిక్షణ.. తర్వాతే బడ్జెట్ సమావేశాలు..
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?