Delhi Assembly Election 2025: ఎన్నికల బరిలో ఉన్న ప్రముఖులు వీళ్లే!
- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం
- ఎన్నికల బరిలో ఉన్న ప్రముఖులు వీళ్లే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. ఓటింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 1.56 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. బుధవారం ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం 6:30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఇక్కడ ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. 699 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో ఉన్నారు.
ఢిల్లీలో 58 జనరల్, 12 ఎస్సీ రిజర్వ్ సీట్లు ఉన్నాయి. 83.49 లక్షల మంది పురుషులు.. 71.74 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక 20 నుంచి 29 ఏళ్ల వయసు ఉన్న యువ ఓటర్ల సంఖ్య 25.89 లక్షలు కాగా… ఇక 2.08 లక్షల మంది ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేయనున్నారు. వికలాంగులు 79,430 మంది ఓటర్లు ఉండగా.. 100 ఏళ్లు దాటిన ఓటర్ల సంఖ్య 830.. 85 ఏళ్ల వయసు దాటిన ఓటర్ల సంఖ్య 1.09 లక్షలుగా ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు. మరోవైపు ఢిల్లీలో ట్రాన్స్‌జెండర్ ఓటర్ల సంఖ్య 1261 ఉన్నారు.
Also Read
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్‌కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
- TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్‌లో మమత బెనర్జీ విధేయులు..
అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి. మరోసారి అధికారం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నిస్తుండగా.. ఈ సారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ ఆరాటపడుతోంది. అలాగే కాంగ్రెస్ కూడా గట్టిగానే ప్రచారం నిర్వహించింది. రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఆప్, బీజేపీ ఉచిత పథకాలను ప్రకటించాయి. ఎవరికి వారే పోటాపోటీగా హామీలు గుప్పించారు. కానీ హస్తిన వాసులు ఎవరికీ అధికారం కట్టబెడతారో చూడాలి. ఇక ఈ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి బరిలో దిగారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక స్థానాలు
న్యూఢిల్లీ నియోజకవర్గం
ఆప్ – అరవింద్ కేజ్రీవాల్
బీజేపీ – పర్వేష్ వర్మ
కాంగ్రెస్ – సందీప్ దీక్షిత్
కల్కాజీ నియోజకవర్గం
ఆప్ – అతిషీ
బీజేపీ – రమేష్ బిధూరీ
కాంగ్రెస్ – అల్కా లంబా
జంగ్‌పురా నియోజకవర్గం
ఆప్ – మనీష్ సిసోడియా
బీజేపీ – సర్దార్ తర్వీందర్ సింగ్ మార్వా
కాంగ్రెస్ – ఫర్హాద్ సురి
ప్రతాప్గంజ్ నియోజకవర్గం
ఆప్ – అవధ్ ఓజా
బీజేపీ – రవిందర్ సింగ్ నేగి
కాంగ్రెస్ – అనిల్ చౌదరీ
మాలవ్యా నగర్ నియోజకవర్గం
సోమనాథ్ భారతీ (ఆప్)
సతీష్ ఉపాధ్యాయ( బీజేపీ)
జితేందర్ కుమార్ కోచర్ (కాంగ్రెస్)
ఛత్తార్పూర్ నియోజకవర్గం
బ్రహ్మ సింగ్ తన్వార్ (ఆప్)
ఖర్తార్ సింగ్ తన్వార్ (బీజేపీ)
రాజేందర్ సింగ్ తన్వార్ (కాంగ్రెస్)
బల్లిమరాన్ అసెంబ్లీ నియోజకవర్గం
ఇమ్రాన్ హుస్సేన్ (ఆప్)
హరూన్ యూసఫ్ (కాంగ్రెస్)
కమల్ బగ్రీ (బీజేపీ)
ఓక్లా అసెంబ్లీ నియోజకవర్గం
అమనతుల్లా ఖాన్ (ఆప్)
బ్రహ్మం సింగ్ (బీజేపీ)
అరిబ్ ఖాన్( కాంగ్రెస్)
షాకుర్ బస్తీ అసెంబ్లీ నియోజకవర్గం
సత్యందర్ జైన్ (ఆప్)
కరైన్ సింగ్(బీజేపీ)
సతీష్ లూథ్రా (కాంగ్రెస్)
రోహిణి అసెంబ్లీ నియోజకవర్గం
ప్రదీప్ మిట్టల్ (ఆప్)
సుమేష్ గుప్తా (కాంగ్రెస్)
విజేందర్ గుప్తా (బీజేపీ)
తాజావార్తలు
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!