NEET: నీట్ రీ-ఎగ్జామ్ ఉండదు.. పేపర్ లీక్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
- నీట్ పరీక్ష రద్దుకు నో చెప్పిన సుప్రీంకోర్టు..
- మళ్లీ రీ ఎగ్జామ్ అవసరం లేదని ఈ రోజు తీర్పు..
- 24 లక్షల మంది విద్యార్థుల ప్రయోజనాలే ముఖ్యమన్న సుప్రీం.. భవిష్యత్తులో లీకులు జరగకుండా చూసుకోవాలని కేంద్రానికి సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NEET: నీట్ పేపర్ లీక్ కేసుపై సుప్రీంకోర్టు ఈ రోజు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత దశలో పరీక్షాల ఫలితాలు విఫలమయ్యాయని లేదా ఏదైనా క్రమబద్ధమైన ఉల్లంఘన జరిగిందని నిర్ధారించే అంశాలు రికార్డులో లేవని సుప్రీంకోర్టు పేర్కొంది. పరీక్షా ప్రశ్నాపత్రం వ్యవస్థాగతంగా లీక్ అయిందనే ఆధారాలు లేవని సుప్రీంకోర్టు చెప్పింది. మే 5న జరిగిన నీట్-యూజీ 2024 పరీక్ష పేపర్ లీక్ జరిగిందని, పరీక్షలో అవకతవకలు జరిగాయని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు ఉత్తర్వులను జారీ చేసింది.
Read Also: Hamas: పాలస్తీనా కోసం ప్రత్యర్థి గ్రూపులతో చేతులు కలిపిన హమాస్.. బీజింగ్ వేదికగా ఒప్పందం..
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
నీట్ రీ-ఎగ్జామ్ అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పరీక్షను రద్దు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. రద్దు చేస్తే ఈ పరీక్షకు హాజరైన 24 లక్షల మంది విద్యార్థులకు తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని చెప్పింది. సీబీఐ నివేదిక ప్రకారం దర్యాప్తు జరుగుతోందని మరియు హజారీబాగ్ మరియు పాట్నాలోని పరీక్షా కేంద్రాల నుండి 155 మంది విద్యార్థులు పేపర్ లీక్‌తో లబ్ధిపొందినట్లు కనిపిస్తోందని సీబీఐ చెప్పిందని సుప్రీంకోర్టు పేర్కొంది.
మే 5న దేశవ్యాప్తంగా నీట్-యూజీ పరీక్షలు నిర్వహించబడ్డాయి. జూన్ 4న వీటి ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 4750 సెంటర్లలో నీట్ యూపీ పరీక్షలు నిర్వహించారు. విదేశాల్లో 14 సెంటర్లలో పరీక్ష నిర్వహించారు. అయితే, ఈ పరీక్ష ఫలితాల అనంతరం ప్రశ్నాపత్నం లీక్ అయినట్లు వెలుగులోకి వచ్చింది. దీనిపై సీబీఐ విచారణ జరుపుతోంది. ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, మహారాష్ట్రలో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విచారణ చేస్తోంది. ఇదిలా ఉంటే నీట్ నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. భవిష్యత్తులో జరిగే పరీక్షల్లో ఎలాంటి లీకులు జరగకుండా జాగ్రత్త పడాలని చెప్పింది.
Supreme Court declines to cancel NEET-UG 2024 exam.
Supreme Court says it realises that directing a fresh NEET-UG for the present year would be replete with serious consequences which will be for over 24 lakh students who appeared in this exam. pic.twitter.com/eudsFnNHGg
— ANI (@ANI) July 23, 2024
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!