Site icon NTV Telugu

IMD Weather report: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Imdweatherreport

Imdweatherreport

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మిజోరం, త్రిపురలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అల్పపీడనం ఆదివారం వాయువ్య దిశగా పయనించనుందని ఐఎండీ శాస్త్రవేత్త సోమసేన్ తెలిపారు. ఈ ప్రభావంతో బెంగాల్, జార్ఖండ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఢిల్లీలో శని, ఆదివారాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: Polavaram Project Files: పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం.. స్పెషల్ కలెక్టర్ ఏం చెప్పారంటే..?

ఇదిలా ఉంటే దేశంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయమంతా వేడి వాతావరణం ఉంటుంది. ఉక్కుపోత, చెమటలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సాయంత్రం అయ్యేసరికి మాత్రం మేఘాలు దట్టంగా కమ్ముకుని వర్షాలు దంచికొడుతున్నాయి. ఇలా విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు దోమలు కూడా స్వైర విహారం చేస్తున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా తిరుగుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇది కూడా చదవండి: Kolkata doctor case: వైద్య బృందంతో కేంద్రం చర్చలు.. భద్రతపై కమిటీ ఏర్పాటుకు హామీ

ఇదిలా ఉంటే ఆయా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదులు, చెరువులు నిండి కుండల్లా దర్శనమిస్తున్నాయి. శనివారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

 

Exit mobile version