Ashok Gehlot: రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మను పదవి నుంచి తొలగించడానికి భారతీయ జనతాపార్టీలో కుట్ర జరుగుతోందని మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. తన చుట్టూ ఏమి జరుగుతుందో ఆయనకి తెలియదని అన్నారు. ఢిల్లీ, రాజస్థాన్‌లలో సొంత పార్టీ నాయకులు అతడికి వ్యతిరేకంగా పని చేయడం ప్రారంభించారని పేర్కొన్నారు. కాగా, తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఒక యువకుడికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభించింది.. అది చిన్న విషయం కాదని తెలిపారు. సీఎం పదవి నుంచి భజన్ లాల్ ను తప్పించే బదులు అతన్ని నిలబెట్టుకోవాలి అని అశోక్ గెహ్లాట్ సూచించారు.
Read Also:Lenin : అయ్యగారు అఖిల్ సరసన అప్సరస..
అలాగే, రాష్ట్రంలో పెన్షన్లు, NREGA కింద జీతాలు, విద్యుత్, నీరు వంటి ప్రాథమిక సేవలను అందించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ పని జరగడం లేదు.. నాలుగు నెలలుగా ప్రజలకు పెన్షన్లు రావడం లేదు.. దాదాపు నాలుగు-ఐదు నెలలుగా NREGA కార్మికులకు జీతాలు అందడం లేదు.. వేసవిలో విద్యుత్ కోతలు పెట్టారు, నీటి సంక్షోభం గురించి హెచ్చరికలు ఉన్నప్పటికీ, ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రిగా పని చేసే వ్యక్తికి సామాన్య ప్రజల బాధలు పూర్తిగా తెలియవు.. అందుకే, రాజస్థాన్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి.. ప్రజలు సహాయం కోసం ఏడుస్తున్నారు అని సీఎం భజన్ లాల్ శర్మపై కాంగ్రెస్ సీనియర్ నేత గెహ్లాట్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
