NTV Telugu Site icon

Supreme Court: కమిటీలు వేస్తే కాలుష్యం తగ్గిపోతుందా? విచారణకు నిరాకరించిన సుప్రీంకోర్టు..

Untitled 6

Untitled 6

Delhi: ఢిల్లీలో కోరలు చాచిన గాలి కాలుష్యం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. గత వారం పది రోజులుగా ఢిల్లీలో కొనసాగుతున్న గాలి కాలుష్యం తార స్థాయికి చేరింది. దీనితో చుట్టుపక్కల ప్రాంతాలు కూడా తీవ్ర ప్రభావితం అవుతున్నాయి. చలికాలం ప్రారంభ లోనే కాలుష్య తీవ్రత రోజు రోజుకి తార స్థాయికి చేరుకోనంటోంది. ఉత్తర భారత దేశం లోని పలు ప్రాంతాలు కాలుష్యానికి అల్లాడుతున్నాయి. కాలుష్యం పెరగడం కారణంగా అక్కడి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. పెరిగిన కాలుష్యం కారణంగా కంటి దురద, గొంతు నొప్పితో ప్రజలు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. మరోవైపు, పాలరాతి వర్ణంలో కనిపించే తాజ్‌మహల్ కాలుష్యం కారణంగా రంగు మారిపోయింది. ఏటా శీతాకాలంలో పొగ మంచు, గాలి కాలుష్యం కారణంగా ప్రేమ మందిరం రూపు రేఖలు మారిపోతున్నాయి.

Read also:Tammineni Sitaram: దేశానికే రోల్ మోడల్ గా జగన్ పాలన‌

ఈ తరుణంలో దేశ రాజధానిలో పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు.. జిల్లా స్థాయిలో నిపుణులతో శాశ్వత కమిటీ వేసేలా ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ అజయ్ నారాయణరావ్ గాజ్‌బహర్ అనే వ్యక్తి సోమవారం సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. కాగా దాఖలైన పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కమిటీలు వేస్తే కాలుష్యం తగ్గిపోతుందా? అని ప్రశ్నించింది.