Site icon NTV Telugu

INDIA Bloc: ఖర్గే నివాసంలో కూటమి నేతల భేటీ.. పార్లమెంట్ సమావేశాలపై చర్చ

Indiabloc

Indiabloc

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలు భేటీ అయ్యారు. ఢిల్లీలోని ఖర్గే ఇంట్లో ఈ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంగళవారం కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్, సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలంతా చర్చిస్తున్నారు. ఈ భేటీలో కూటమిలోని లోక్‌సభ, రాజ్యసభ ఫ్లోర్ లీడర్లు పాల్గొన్నారు. అలాగే లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కేసీ వేణుగోపాల్, శరద్‌ పవార్, సంజయ్‌ రౌత్‌ తదితరులు హాజరయ్యారు.

ఇది కూడా చదవండి: NEET UG 2024 Counselling: రేపు నీట్ యూజీ కౌన్సెలింగ్ ప్రక్రియ..ఈ పత్రాలు తప్పనిసరి

ఇదిలా ఉంటే మంగళవారం పార్లమెంట్‌లో సంకీర్ణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఇండియా కూటమి నేతలు విమర్శలు గుప్పించారు. ఇక ఖర్గే మాట్లాడుతూ.. మిత్రపక్షాలైన జేడీయూ, టీడీపీని మచ్చిక చేసుకునేందుకు బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు ఉందని వ్యా్ఖ్యానించారు.

ఇది కూడా చదవండి: UP: రూ.20, చాక్లెట్లతో ప్రలోభ.. 8 ఏళ్ల బాలికపై అత్యాచారం

Exit mobile version