NTV Telugu Site icon

Passport Index: ప్రపంచంలో శక్తివంతమైన, చెత్త పాస్‌పోర్ట్ కలిగిన దేశాలు ఇవే.. భారత్ స్థానం ఎంతంటే..?

India Passport

India Passport

Passport Index: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టు కలిగిన దేశాలుగా ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ దేశాలు మొదటిస్థానంలో నిలిచాయి. ఈ దేశాలకు ప్రపంచంలోని 194 దేశాలకు వెళ్లేందుకు ‘వీసా ఫ్రీ’ సౌకర్యం ఉంది. యూకే 4వ స్థానంలో, ఆస్ట్రేలియా 5వ స్థానంలో, న్యూజిలాండ్ 6వ స్థానంలో, కెనడా 7వ స్థానంలో, అమెరికా 8వ స్థానంలో నిలిచాయి. యూఎస్ పాస్‌పోర్టుతో 188 దేశాలకు వీసా ఫ్రీ ట్రావెల్ సౌకర్యం ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (IATA) డేటా ఆధారంగా.. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ఈ వివరాలను వెల్లడించింది.

Read Also: CEC Rajiv Kumar: పోలింగ్ ప్రక్రియలో జోక్యం చేసుకునే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు..

ఈ జాబితాలో భారత్ 80వ స్థానంలో ఉంది. భారత దేశం నుంచి 62 దేశాలకు వెళ్లేందుకు వీసా ఫ్రీ సౌకర్యం ఉంది. మన పొరుగుదేశాలైన చైనా 62 స్థానంలో ఉండగా.. పాకిస్తాన్ ఏకంగా 101 స్థానంలో ఉంది. పాక్ పాస్‌పోర్టుతో కేవలం 32 దేశాలకు మాత్రమే వీసాఫ్రీ అరైవల్ సౌకర్యం ఉంది. మయన్మార్ 92వ స్థానంలో, బంగ్లాదేశ్ 97వ స్థానంలో, శ్రీలంక 96వ స్థానంలో ఉంది.

అత్యంత చెత్త పాస్‌పోర్టులు ఉన్న దేశాల్లో జాబితాలో ఆఖరుగా ఆఫ్ఘనిస్తాన్ 104వ స్థానంలో ఉంది. ఆఫ్ఘన్ పాస్‌పోర్టు ద్వారా కేవలం 28 దేశాలకు మాత్రమే వీసాఫ్రీ ట్రావెల్ సౌకర్యం ఉంది. అట్టడుగు టాప్-5 దేశాల్లో యెమెన్, పాకిస్తాన్, ఇరాక్, సిరియా, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి.