Site icon NTV Telugu

Social Boycott: ఊరి నుంచి బహిష్కరణ.. ట్రాక్టర్‌ నడపడమే ఆమె చేసిన తప్పు..!

Social Boycott

Social Boycott

మహిళలలు ప్రపంచంతో పోటీపడుతున్నారు.. వంట గదికే మేం పరిమితం కాదు.. మాకు సరిహద్దులు లేవంటూ అన్ని రంగాల్లో రాణిస్తున్నారు.. విద్యలోనూ కాదు.. ఉద్యోగాల్లోనూ మాకు తిరుగులేదని సత్తా చాటుతున్నారు.. అయినా, వారి పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది… అయితే, తమ కుటుంబ బారాన్ని భుజానికి ఎత్తుకున్న ఓ యువతి.. తమకు ఉన్న పొలంలో వ్యవసాయ పనులు మొదలు పెట్టింది.. అంతే కాదు.. పొరుగునే మరికొంత భూమిని లీజుకు తీసుకుని వ్యవసాయం చేస్తోంది.. వ్యవసాయ పనుల కోసం ఆమె ట్రాక్టర్‌ వినియోగిస్తోంది.. అక్కడే అసలు చిక్కు వచ్చింది.. ట్రాక్టర్​ దున్ని వ్యవసాయం చేస్తే గ్రామానికి చెడు జరుగుతుందని వాదిస్తోన్న గ్రామస్తులు.. ఆ యువతని గ్రామం నుంచి బహిష్కరించారు.. ఓవైపు దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అయ్యిందంటూ.. సంబరాలు చేసుకుంటుంటే.. మనం ఇంకా ఎక్కడ ఉన్నామని ఇలాంటి కొన్ని ఘటనలు నిరూపిస్తూనే ఉన్నాయి..

Read Also: Common Wealth Games 2022: కామన్‌వెల్త్ క్రీడల్లో భారత్ షెడ్యూల్ నేడు

ఇక, 22 ఏళ్ల యువతిని గ్రామ బహిష్కరణ చేసిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్‌ గుమ్లా జిల్లా బిషున్‌పూర్ బ్లాక్‌లోని శివనాథ్‌పూర్ పంచాయతీ పరిధిలో ఓ కుటుంబం నివాసం ఉంటుంది.. అక్కడ మంజు ఒరాన్ అనే యువతి తన తల్లిదండ్రులు మరియు సోదరుడితో కలిసి జీవిస్తోంది.. గుమ్లాలోని కార్తీక్ ఓరాన్ కళాశాలలో బీఏ మొదటి సంవత్సరం చదువుతున్న మంజుకు ఆరు ఎకరాల సాగు భూమి ఉంది… ఆ భూమిని సాగుచేస్తూ ఆ కుటుంబం జీవనం సాగిస్తోంది.. ఆ కుటుంబం పదెకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయ పనుల కోసం దైనిక్ భాస్కర్‌ అనే వ్యక్తితో మాట్లాడిన మంజు.. గత నెలలో పాత ట్రాక్టర్ కొనుగోలు చేశారు.. ఆ ట్రాక్టర్‌తో తన పొలాల్లో పనులు చేస్తోంది.. స్వయంగా పొలాన్ని దున్నుతోంది. ఇక్కడే అసలు చిక్కు వచ్చింది.. దీనిని గమనించిన గ్రామస్థులు.. మహిళలు ట్రాక్టర్​ నడపితే చెడు జరుగుతోందని.. దీని వల్ల గ్రామంలో కరవు వస్తుందన్న నమ్మకంతో.. మంజు ట్రాక్టర్‌ ​తో దున్నడం వల్ల గ్రామానికి చెడు జరుగుతుందని.. వెంటనే నిలిపివేయాలని వారించారు.

అంతేకాదు.. ఆ గ్రామ కట్టుబాట్లను దాటి ట్రాక్టర్‌ నడిపిందంటూ.. జరిమానా విధించారు… అయితే, ఆ యువతి మాత్రం వెనక్కి తగ్గలేదు.. తన తాను చేసుకుంటూ పోయింది.. దీంతో, వ్యవహారం అక్కడితో ఆగలేదు.. పంచాయతీ నిబంధనలను అతిక్రమించినందుకు మంజును గ్రామ బహిష్కరణ చేయాలని నిర్ణయించారు. కానీ, గ్రామస్థులు చేసిన తీర్మానాన్ని తిరస్కరించిన ఓ యువతి.. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు.. అంతరిక్షంలో సైతం అడుగుపెట్టారు.. కానీ, తాను వ్యవసాయం ఎందుకు చేయొద్దంటూ ప్రశ్నించింది. తనకు వ్యవసాయం అంటే ఇష్టం.. పంచాయతీ విధించిన షరతులను అంగీకరించేది లేదు.. ట్రాక్టర్‌తో వ్యవసాయం కొనసాగిస్తానని స్పష్టం చేసింది మంజు. ఇక, తన పొలాల్లో ట్రాక్టర్‌ నడపడం ఇదే మొదటిసారి కాదని.. ఇంతకు ముందు కూడా పొలాల్లో ట్రాక్టర్ నడుపుతూ వ్యవసాయం చేశా.. ఈసారి ఎందుకు ఇబ్బందులు పడుతున్నారో అర్థం కావడం లేదని ఆ యువతి మండిపడుతోంది..

Exit mobile version