Site icon NTV Telugu

Walayar case: కూతుళ్లపై రేప్‌కి పేరెంట్స్ సహాయం.. ‘‘వలయార్ కేసు’’ భయపెట్టే నిజాలు..

Walayar Case

Walayar Case

Walayar case: 2017లో కేరళలో సంచలనంగా మారిన ‘‘వలయార్ కేసు’’లో సంచలన విషయాలు సీబీఐ విచారణలో వెలుగులోకి వచ్చాయి. సొంత తల్లి కూతుళ్లపై అత్యాచారం చేసేందుకు సహకరించిందని, నిందితుల్లో ఒకరితో ఆమెకు సంబంధం ఉందని, తల్లిదండ్రులే వారి పిల్లలపై పదే పదే లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సీబీఐ అభియోగాలు మోపింది. తల్లి తన పిల్లల సమక్షంలోనే ప్రధాన నిందితుడితో లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు ఛార్జిషీట్‌లో పేర్కొంది.

లైంగిక వేధింపులను తాళలేక, తల్లిదండ్రుల నుంచి సహకారం లేకపోవడంతో 13, 09 ఏళ్ల ఇద్దరు బాలికలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో మొదటి నిందితుడు వాలియ మధు బాలికలపై లైంగిక దాడికి పాల్పడినట్లు, ఇందుకు తల్లిదండ్రులు సహకరించినట్లు అభియోగం మోపింది. బాలికల తల్లిదండ్రులపై లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద సహా పలు ఆరోపణల కింద విచారణ ఎదుర్కొన్నారు.

Read Also: Farmers Protest: సాగునీటిని అందించాలంటూ రైతుల ఆందోళన

కేసు వివరాలు:

2017లో జనవరి 13న 13 ఏళ్ల బాలిక వలయార్‌లోన అట్టప్పలంలోని తన గదిలో ఇంట్లో ఉరి వేసుకుని మరణించింది. దాదాపు రెండు నెలల తర్వాత మార్చి 4, 2017లో ఆమె చెల్లెలు కూడా ఇదే విధంగా మరణించింది. ముందుగా వీటిని ఆత్మహత్యలని భావించినప్పటికీ, స్థానికంగా ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. పోస్టుమార్టం నివేదికల్లో లైంగిక దాడి జరిగిందని నిర్ధారించాయి, అయితే, ఆధారాలు లేకపోవడంతో కేసుని కొట్టేశారు.

ఈ కేసుపై సిట్ ఏర్పడింది. జూన్ 2019లో లైంగిక వేధింపులే ఇద్దరి మరణాలకు దారి తీశాయని పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. అయితే, పాలక్కాడ్ పోక్సో కోర్టు నిందితులు వాలియ మధు, ఎం మధు, శిబు, ప్రదీప్ కుమార్‌లపై సాక్ష్యాలు లేకపోవడంతో నిర్దోషులుగా విడుదల చేసింది. ఇది కేరళ వ్యాప్తంగా భారీ నిరసనలు కారణమైంది. దీంతో కేరళ హైకోర్టు 2021లో సీబీఐ విచారణకు ఆదేశించింది. సీబీఐ మొదటి ఛార్జిషీట్, 2021లో పోలీసులు ఛార్జిషీట్ మధ్య సారుప్యతలు ఉండటంతో పాలక్కాడ్ పోక్సో కోర్టు తిరస్కరించింది. ఆగస్టు 2024లో కేరళ హైకోర్టు ఈ కేసుని ఎర్నాకుళం సీబీఐ కోర్టుకు బదిలీ చేసింది, పునర్విచారణ అవసరమని పేర్కొంది.

Read Also: Bangladesh: “ఆపరేషన్ డెవిల్ హంట్‌” తో షేక్ హసీనా మద్దతుదారుల్ని టార్గెట్ చేస్తున్న యూనస్ సర్కార్..

సీబీఐ ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు..

తాజాగా సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీటులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలికలపై వారి సొంత తల్లిదండ్రులే లైంగిక దాడికి అనుమతించారనే విషయం తెలిసింది. ఏళ్ల తరబడి లైంగిక దోపిడీని భరించారని పేర్కొంది. తల్లి మొదటి నిందితుడితో లైంగిక సంబంధం పెట్టుకుందని, తన పెద్ద కుమార్తెపై రేప్ జరిగిందని తెలిసినా, తన చిన్న కుమార్తెపై అత్యాచారానికి సహకరించినట్లు ఛార్జిషీట్ వెల్లడించింది.

తల్లిదండ్రులు తన పిల్లల్ని రక్షించాల్సింది పోయి, నిందితుడు మద్యం తాగిన తర్వాత వేధింపులకు పాల్పడేందుకు సహకరించినట్లు తల్లి సహకరించిందని తేలింది. 2016 ఏప్రిల్‌లో మొదటి నిందితులు పెద్ద కుమార్తెపై అత్యాచారం చేయడాన్ని చూసిందని, రెండు వారాల తర్వాత తండ్రి కూడా వేధింపులు జరుగుతున్నట్లు చూశాడని, అయినప్పటికీ ఎవరూ పోలీసులకు చెప్పకుండా, నేరస్తులతో సంబంధాన్ని కొనసాగించారు.

అక్క మరణించిన తర్వాత, చిన్న కూతురిని మొదటి నిందితుడి ఇంటికి పంపారు. ఉద్దేశపూర్వకంగా తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు సీబీఐ తేల్చింది. తన అక్క ఎదుర్కొంటున్న వేధింపుల గురించి తెలిసిన చిన్న అమ్మాయి తీవ్ర మనోవేధనకు గురైనట్లు సీబీఐ పేర్కొంది.

Read Also: Ranveer Allahbadia: “తల్లిదండ్రుల సె**క్స్” కామెంట్స్.. క్షమాపణలు చెప్పిన యూట్యూబర్

హత్య..? ఆత్మహత్యా..?

అయితే, బాలికలు హత్యకు గురయ్యారా..? ఆత్మహత్య చేసుకున్నా..? అనే దానిపై సీబీఐ హత్యను తోసిపుచ్చింది. ఆత్మహత్య కావచ్చని అభిప్రాయపడింది. పోస్ట్‌మార్ట ఫలితాలు ఉరితో సరిపోతున్నట్లు పోలీస్ సర్జన్ నివేదిక నిర్ధారించింది. తీవ్రమైన వేధింపులు, తల్లిదండ్రుల మద్దతు లేకపోవడంతో బాలికలు ప్రాణాలు తీసుకుని ఉండొచ్చని మానసిక పరీక్షల్లో సూచించబడింది.

గతంలో ప్రజాపోరాటాలకు నేతృత్వం వహించిన తల్లి సీబీఐ విచారణను ద్రోహంగా అభివర్ణించింది. సీబీఐపై నమ్మకాన్ని కోల్పో్యామని చెప్పింది. తాను, తన భర్త తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు పాలిగ్రాఫ్ టెస్టుకు సిద్ధమని చెప్పింది. తల్లిదండ్రుల ప్రమేయం ఉందానా అనేది కోర్టు నిర్ధారించాల్సి ఉంది. ఒక వేళ ఆరోపణలు నిజమని తెలిస్తే దోషులకు జీవిత ఖైదుతో పాటు కఠినమైన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Exit mobile version