Site icon NTV Telugu

Puttur: ప్రముఖ టైగర్ టీం టైగర్స్ కల్లెగ కెప్టెన్‌ దారుణ హత్య

Untitled 4

Untitled 4

Dakshina Kannada district: కర్ణాటక రాష్ట్రం లోని దక్షిణ కన్నడ జిల్లా లోని పుత్తూరు లో దారుణం చోటు చేసుకుంది. ప్రముఖ టైగర్ టీం టైగర్స్ కల్లెగ కెప్టెన్‌ దారుణ హత్యకు గురైయ్యారు. కాగా నిందితులను పోలీసులు అదుపు లోకి తీసుకుని విచారిస్తున్నారు. వివరాలలోకి వెళ్తే.. పుత్తూరు నగరం లోని నెహ్రూనగర్‌లో సోమవారం అర్థరాత్రి ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మృతి చెందిన వ్యక్తిని అక్షయ్ కల్లెగ పోలీసులు గుర్తించారు. అక్షయ్ కల్లెగ ప్రముఖ టైగర్ టీం టైగర్స్ కల్లెగ కెప్టెన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కాగా సోమవారం సాయంత్రం అక్షయ్ వాహనం మరి కొంతమంది యువకుల వాహనం అనుకోకుండా ఢీకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.

Read also:Hashmatullah Shahidi: భారత అభిమానుల వల్లే ఈ విజయాలు.. రుణపడి ఉంటాం: అఫ్గాన్‌ కెప్టెన్‌

ఈ నేపథ్యంలో ప్రమాదవశాత్తు జరిగిన నష్టం గురించి మాట్లాడేందుకు నెహ్రూనగర్ రావాల్సిందిగా నిందితులు రాత్రి 11.30 గంటల సమయంలో అక్షయ్‌కు ఫోన్ చేశారు. ఫోన్ కాల్ కి స్పందిచి వెళ్లిన అక్షయ్‌ ను నెహ్రూనగర్ సమీపంలో హత్యా చేశారు. కాగా ఈ కేసులో ముగ్గురు నిందితులను పుత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. హత్య కేసులో అరెస్టు అయిన నిందితులను చేతన్, మనీష్, మంజునాథ్‌ గా గుర్తించారు. ఈ నేపథ్యంలో పోలీసులు నిందితులను విచారించగా.. ప్రాధమిక విచారణలో ఈ విషయం బయకు వచ్చింది. కాగా రెండు నెలల్లో పుత్తూరు నగరంలో ఇది రెండో హత్య. ఆగస్టు చివరి వారంలో పుత్తూరు మహిళా పోలీస్ స్టేషన్ ఎదుట ఓ యువతిని ప్రేమికుడు కత్తితో పొడిచి చంపాడు.

Exit mobile version