The drug peddler had cocaine capsules in his stomach at Bengaluru airport: బెంగళూరులో కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ పట్టుకుని చాలా మందిని అరెస్టు చేశారు. డ్రగ్స్ విక్రయించే వారిని పోలీసులు అరెస్టు చేస్తున్నా కొత్తగా డ్రగ్స్ డీలర్లు మాత్రం పుట్టుకు వస్తున్నారు. ఈసారి ఎయిర్ పోర్టులోని కస్టమ్స్ అధికారులకు డ్రగ్స్ డీలర్స్ దొరికిపోయారు. ఎయిర్ పోర్ట్ లో ఓ ప్రయాణికుడి బ్యాగ్ లు, అతను వేసుకున్న దుస్తులు, షూలు మొత్తం పరిశీలించినా కస్టమ్స్ అధికారులకు ఒక్కగ్రాము కూడా డ్రగ్స్ చిక్కలేదు. డౌట్ రావడంతో అతన్ని ఆసుపత్రి తరలించారు. ఎంతో శ్రమించిన డాక్టర్లు అతని కడుపులో ఉన్న 13 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ క్యాప్సిల్స్ బయటకు తియ్యడంతో కస్టమ్స్ అధికారులు షాక్ కు గురయ్యారు.
అడిస్ అబాబ దేశం నుంచి ఇథోపియా ఎయిర్ లైన్స్ ET 690 విమానంలో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం (కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం)కు ఘనా దేశంలో నివాసం ఉంటున్న బాహా అంపాడు క్వాడ్వో (53) అనే వ్యక్తి వచ్చాడు. బెంగళూరు ఎయిర్ పోర్టులో దిగిన బాహా అంపాడు ఎలాంటి టెన్షన్ లేకుండా బయటకు వెళ్లడానికి ప్రయత్నించాడు. ఎయిర్ పోర్ట్ లో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుడు బాహా అంపాడు బ్యాగ్ లు, అతను వేసుకున్న దుస్తులు, షూలు మొత్తం పరిశీలించినా కస్టమ్స్ అధికారులకు ఒక్కగ్రాము కూడా డ్రగ్స్ చిక్కలేదు. అయినా అతనిపై డౌట్ రావడంతో బాహా అంపాడోను ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ఆసుపత్రికి తరలించి, వైద్యపరీక్షలు చేయించారు.
విదేశాల నుంచి విమానంలో బెంగళూరు వచ్చిన బహా అంపాడోకు స్కానింగ్ తీసిన వైద్యులు షాక్ అయ్యారు అతని కడుపులో 104 క్యాప్సిల్స్ ఉన్నాయని డాక్టర్లు గుర్తించారు. మూడు రోజుల పాటు శ్రమించిన వైద్యులు అతని కడుపులో ఉన్న 104 క్యాప్సిల్స్ బయటకు తీశారు. ఒక్క క్యాప్సిల్ పగిలిపోయినా బహా అంపాడో ప్రాణం పోయి ఉండేదని వైద్యులు అంటున్నారు. బహా అంపాడో కడుపులో ఉన్న 1.2 కేజీల డ్రగ్స్ విలువ రూ. 13. 60 కోట్ల విలువ ఉంటుందని, అతను ప్రాణాలకు తెలించి కడుపులో డ్రగ్స్ పెట్టుకుని బెంగళూరు వచ్చాడని, బెంగళూరులో ఎవరికి ఇవ్వడానికి ప్రయత్నించాడు అని ఆరా తీస్తున్నామని బెంగళూరు అంతర్జతీయ విమానాశ్రంలోని కస్టమ్స్ అధికారులు అంటున్నారు.
Vikarabad hidden treasures: గుప్త నిధుల కలకలం.. యజమానిపై గ్రామస్తుల దాడి
