CM Sister: ఎవరైనా మంత్రి, ముఖ్యమంత్రి బంధువులు అంటే ఎలా ఉంటారు. ఎంతో దర్పంతో.. దర్జాగా ఉంటారు. వారికి రాబడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలతో లగ్జరీగా కాలం గడుపుతారు. కానీ ఇక్కడ ఆమె ముఖ్యమంత్రి సోదరి అయినప్పటికీ.. ఆమె చిన్న టీ దుకాణాన్ని నడిపిస్తూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి చెల్లెలు అయి ఉండి కూడా టీ దుకాణం నడుపుతున్న ఆవిడ ఎవరు.. ఎక్కడ ఉంటారంటే.. ఇదిగో ఇది చదవండి..
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోదరి శశి పాయల్ ఓ చిన్న గ్రామంలో టీ దుకాణాన్ని నడుపుతూ నిరాడంబర జీవితాన్ని గడుపుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని పౌఢీలో మాతా భువనేశ్వరీ ఆలయం సమీపంలో శశి పాయల్ టీ దుకాణం ఉంది. వర్షం పడిందంటే ఆ మార్గంలో వెళ్లడం కూడా కష్టమే. ఈ వీడియోను మాజీ ఎమ్మెల్యే దినోశ్ చౌదరి తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేయగా.. అది వైరల్‌గా మారింది.
Read alsoఫ Nerve Burning : చేతులు, కాళ్లకు నరాల మంటలు వస్తున్నాయా? ఇదే కారణం కావొచ్చు..
ఉత్తరాఖండ్ పౌంఢీలో జన్మించిన యోగి ఆదిత్య నాథ్‌కు ఏడుగురు తోబుట్టువులు. వారిలో పెద్దవారు శశి పాయల్ కాగా.. యోగి అయిదో సంతానం. కొఠార్ గ్రామానికి చెందిన పురాన్‌సింగ్‌ను శశిపాయల్ వివాహం చేసుకున్నారు. 1994లో యోగి సన్యసించిన అనంతరం దాదాపు 28 ఏళ్లుగా తన సోదరుడికి రాఖీ కట్టడం లేదన్న శశి పాయల్.. ఏటా రక్షాబందన్ నాడు ఖచ్చితంగా రాకీ పంపుతుంటానని చెప్పారు. నేటి రాజకీయ వ్యవస్థలో, ప్రాంతీయ పార్టీ అయినా, జాతీయ పార్టీ అయినా మనం చూసేది కుటుంబ పాలన. ముఖ్యంగా సీఎం కుటుంబ సభ్యులు, బంధువులు అధికారంలో ఉన్నంత కాలం కీలకపాత్ర పోషిస్తారు. అయితే, కుటుంబ పాలన, రాజవంశ పాలనను ప్రోత్సహించని, ముఖ్యమంత్రి అయ్యాక కూడా తమ కుటుంబ సభ్యుల జీవన విధానం మారకుండా ఉండే కుటుంబ సభ్యులు చాలా అరుదుగా ఉంటారు. వారిలో ఒకరు శశి పాయల్.