Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లోని కిష్ట్వార్‌లో ఇటీవల ఉగ్రవాదులు ఇద్దరు విలేజ్ గార్డుల్ని చంపేశారు. అయితే, ఈ ఘాతుకానికి పాల్పడిన ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు గుర్తించాయి. ఈ ఘటన వెనక ఉన్న నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు కార్నర్ చేశాయి. వీరిని తుదముట్టించేందుకు భారీ ఎన్‌కౌంటర్ జరుగుతోంది. ఎదురుకాల్పుల్లో ఆర్మీ అధికారితో పాటు మరో జవాన్ గాయపడ్డారు.
Read Also: Varanasi: ఒకే గ్రామంలోని 40 మంది వర్జిన్ అమ్మాయిలను.. గర్భిణులుగా ప్రకటిస్తూ మెసేజ్..
ఇటీవల అధ్వరి నుంచి ఇద్దరు గ్రామ రక్షణ సిబ్బందిని ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి గురువారం కాల్చి చంపారు. ఈ ఘటనకు పాల్పడిన ఉగ్రవాదులు భద్రతా బలగాలకు చిక్కినట్లు కిష్ట్వార్ పోలీసులు ధృవీకరించారు. “కేష్వాన్ కిష్త్వార్‌లో ఉగ్రవాదులు మరియు భద్రతా బలగాల మధ్య ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. 3-4 మంది ఉగ్రవాదులు చిక్కుకున్నారని భావిస్తున్నారు. ఇద్దరు అమాయక గ్రామస్తులను చంపింది ఇదే గుంపు” అని వారు చెప్పారు.
గడిచిన 24 గంటల్లో జమ్మూ కాశ్మీర్‌లో ఇది మూడో ఎన్‌కౌంటర్. అంతకుముందు శ్రీనగర్‌లోని జబర్వాన్ అడవిలో ఉగ్రవాద వ్యతిరేఖ ఆపరేషన్ సందర్భంగా ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇది నిన్న బారాముల్లా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాదిని బలగాలు మట్టుబెట్టాయి. రాజ్‌పురా ప్రాంతంలో అనుమానాస్పద కార్యకలాపాలను గమనించిన తర్వాత భద్రతా దళాలు మరియు రాష్ట్ర పోలీసులు సంయుక్త ఆపరేషన్‌ను ప్రారంభించారు.