NTV Telugu Site icon

Terrorist Attack: రాజౌరిలోని ఆర్మీ క్యాంపుపై కాల్పులు.. ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్

Jammu

Jammu

Terrorist Attack: జమ్మూకశ్మీర్‌లో గత కొద్ది రోజులుగా సైన్యంపై అనేక ఉగ్రదాడులు కొనసాగుతున్నాయి. జులై 8 నుంచి 15 తేదీలలో కతువాలోని మాచేడి, దోడాలోని దేసా అటవీ ప్రాంతాలలో జరిగిన రెండు వేర్వేరు ఉగ్రవాద దాడుల్లో ఒక కెప్టెన్‌తో సహా తొమ్మిది మంది ఆర్మీ సిబ్బంది వీరమరణం పొందారు. తాజాగా, జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో ఈరోజు ఉదయం జరిగిన భారీ ఉగ్రదాడిని సైన్యం భగ్నం చేసింది. తెల్లవారుజామున మూడు గంటలకు ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఇందులో ఒక సైనికుడు గాయపడినట్లు సమాచారం. దీంతో రంగంలోకి దిగిన ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ కోసం భారీగా బలగాలను మోహరించింది.

Read Also: Budget 2024: బడ్జెట్‌లో ఎన్‌పిఎస్, ఆయుష్మాన్‌పై భారీ ప్రకటనలు

అయితే, జమ్మూ కాశ్మీర్‌లోని శాంతియుత ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో భద్రతాను సమీక్షించేందుకు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శనివారం ఇక్కడ పర్యటించారు. జూన్ 30న భారత ఆర్మీ 30వ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆర్మీ చీఫ్ జమ్మూలో పర్యటించారు. ఇక, 2005లో ఉగ్రవాదుల నుంచి విముక్తి పొందిన దోడా జిల్లాలో జూన్ 12 నుంచి వరుసగా ఉగ్రదాడులు కొనసాగుతున్నాయి. అలాగే, ఈ ఏడాది ప్రారంభం నుంచి జమ్మూ ప్రావిన్స్‌లోని ఆరు జిల్లాల్లో జరిగిన సుమారు 12 ఉగ్రవాద దాడుల్లో 11 మంది భారత సైనికులు, ఒక గ్రామ రక్షణ గార్డు, ఐదుగురు ఉగ్రవాదులు సహా మొత్తం 27 మంది మరణించారు.

Show comments