అస్సాంలోని కాకోపథర్‌లోని భారత ఆర్మీ శిబిరంపై గ్రెనేడ్ దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు సైనికులకు గాయాలయ్యాయి. స్థానిక నివేదికల ప్రకారం.. ఆకస్మిక దాడిని నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (NSCN-K-YA), యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం (ULFA-ఇండిపెండెంట్) సంయుక్త బృందం నిర్వహించాయి. ఈ రెండూ కూడా నిషేధిత తిరుగుబాటు సంస్థలు.
Terrorist Attack: జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో ఈరోజు ఉదయం జరిగిన భారీ ఉగ్రదాడిని సైన్యం భగ్నం చేసింది. తెల్లవారుజామున మూడు గంటలకు ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఇందులో ఒక సైనికుడు గాయపడినట్లు సమాచారం. దీంతో రంగంలోకి దిగిన ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ కోసం భారీగా బలగాలను మోహరించింది.